ఏపీలో ఎన్నికలు జరిగి సరిగ్గా నెల రోజులు పైదాటుతోంది. జనం సైతం ఓటేశామన్న సంగతి మరచి చాలా రోజులైంది టీవీలు, పేపర్లు లేకపొతే ఎన్నికల వూసే  పూర్తిగా మరచిపోయేవారు. అంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ నడిచింది. ఇంకా మరో దఫా ఎన్నిక మిగిలే ఉంది.  మరో వారం రోజుల్లో ఏపీలో కౌంటింగ్ జరుగుతుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు కౌంటింగ్ మూడ్లోకి వెళ్ళిపోయాయి. గత నెల రోజులుగా ఎక్కడా రెస్ట్ ఇవ్వకుండా చంద్రబాబు పార్టీని పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు.


అదే సమయంలో వైసీపీ మాత్రం ఇంతవరకూ పొలిటికల్ గా చాలా  విరామం తీసుకుంది. ఇపుడు జగన్ సైతం కౌంటింగ్ మూడ్ లోకి పార్టీని తెస్తున్నారు. ఈ నెల 16న కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా జగన్ సైతం ఈ నెల 22న గుంటూర్లోని తన సొంత ఇంటికి చేరుకోనున్నారు.


అక్కడ నుంచే ఆయన కౌంటింగ్ అంతా  చూస్తారని, పార్టీ శ్రేణులకు సలహాలు ఇస్తారని అంటున్నారు. జనసేన కూడా రెండు రోజుల క్రితం గుంటూర్లోని పార్టీ ఆఫీస్ లో అభ్యర్ధులతో చర్చించింది.  కౌంటింగ్  వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పవన్ దిశా నిర్దేశం చేశారు. మొత్తానికి ఏపీలో ఇపుడు అంతా కౌంటింగ్ వైపు చూపు సారించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: