దేశంలో ఇంత ఎక్కువ కాలం జరిగిన ఎన్నిక బహుశా స్వతంత్ర భారతంలో లేదనే చెప్పాలి. ఏడు దశలు, నలభై మూడు రోజులు. అంతకు నెల రోజుల ముందు నోటిఫికేషన్ ఎలా చూసుకున్నా రెండున్నర నెలల సమయం పట్టేసింది. దేశంలో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా కేవలం ఎన్నికలే అనుకుంటూ అటు పార్టీలు, ఇటు నేతాశ్రీలు తిరగిన పరిస్థితి.


ఇపుడు మిగిలింది ఒకే ఒక్క దశ. అదే చివరి దశ. పార్టీల దశను డిసైడ్ చేసే దశ ఈ నెల 19న జరగనుంది. ఉన్నవి  58 ఎంపీ సీట్లు. చిట్టచివరి పోరుతో విజేతలు ఎవరో తేలిపోతుంది. దాని కంటే ముందు జరిగిన ఆరు దశల పోలింగ్ కూడా చూచాయగా ఉన్న విషయం ఏంటి అన్నది బయటపెట్టింది. ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరికీ మెజారిటీ రాదని కూడా తేల్చేసింది.


దాంతో ఓ వైపు కౌంటింగునకు కౌంట్ డౌన్ మొదలవుతుంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా తమతో కలసివచ్చే వారి కోసం వేట సాగిస్తున్నాయి. మొత్తం సీట్లు మావే, మరో మారు అధికారంలోకి వస్తామని చెబుతున్న మోడీ బ్యాచ్ కూడా ఇపుడు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం పాకులాట మొదలెట్టిది. ఇక కాంగ్రెస్ తనకున్న రాజకీయ చాణక్యాన్ని చూపించి మరీ ఎవరి తమ గూటిలోకి వస్తారా అని పావులు కదుపుతోంది. కౌటింగ్ భయం రెండు పార్టీలను ఆవహించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: