చంద్రబాబునాయుడులో కెసియార్ టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. మంగళవారం మధ్యాహ్నం తమిళనాడుకు చెందిన డిఎంకె ఎంఎల్ఏ దొరై మురగన్ తో జరిగిన భేటీనే చంద్రబాబులో భయానికి నిదర్శనంగా కనిపిస్తోంది. కెసియార్ తనమానాన తానేదో తమిళనాడు, కేరళ టూర్లకు వెళ్ళి వచ్చారు. సోమవారం రాత్రి చెన్నైకి వెళ్ళి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందట.

 

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సిఎంలను, వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలను కెసియార్ కలుస్తున్నారు. గతంలో కూడా కెసియార్ స్టాలిన్ ను కలిసారు. అలాగే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళను కలిసిన విషయం తెలిసిందే. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో కలవాల్సిందిగా వాళ్ళని కెసియార్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇందులో తప్పు కూడా ఏమీ లేదు.

 

అయితే కెసియార్ ఎవరి దగ్గరకు వెళితే వాళ్ళనంతా చంద్రబాబు అనుమానిస్తున్నారు. తాజాగా డిఎంకె ఎంఎల్ఏని పిలిపించుకోవటమే విచిత్రంగా ఉంది. కెసియార్, స్టాలిన్ మధ్య చర్చల సారాంసాన్ని తెలుసుకునేందుకు దొరై మురుగన్ ను చంద్రబాబే  అమరావతికి పిలిపించుకున్నట్లున్నారు. ఆమధ్య ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ తో కెసియార్ భేటీ కాగానే ఒడిస్సా ఎంపిని అమరావతికి పిలిపించుకుని మరీ మాట్లాడారు.

 

నిజానికి కెసియార్ ఎవరితో భేటీ అయితే చంద్రబాబుకు ఎందుకు ? కెసియార్ భేటీలపై అంతగా ఆసక్తి చూపుతున్నారంటేనే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. రాహూల్ భజనను చంద్రబాబు మొదలుపెట్టకమునుపే డిఎంకె యూపిఏలో భాగస్వామి. కాబట్టి ఇపుడేదో కెసియార్ భేటీ అయినంత మాత్రాన స్టాలిన్ స్టాండ్ మారిపోతుందనేందుకు లేదు. అయినా కెసియార్ ప్రతీ భేటీ వివరాలు తెలుసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారంటే....

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: