హజీపూర్ వ‌రుస హ‌త్యల కేసు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల క‌స్ట‌డి ముగిసింది. పోలీసుల విచార‌ణ‌లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి విస్తుపోయే విష‌యాల‌ను వెల్లడించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 8 నుంచి 13 వ తేదీ వ‌ర‌కు కోరు నుంచి అనుమ‌తి తీసుకుని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. 


కాగా.. శ్రీనివాస్‌రెడ్డి నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే న‌ర‌రూప రాక్ష‌సుడి మొబైల్‌లో చాలా మంది యువ‌తుల ఫోటోలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో పోటోను అత‌డికి చూపిస్తూ.. వారు ఎవ‌రూ.. వారి పోటోల‌ను నీ మొబైల్‌లో ఎందుకు ఉంచుకున్నావు అన్న కోణంలో విచారించారు పోలీసులు. 


అయితే అందంగా ఉండే యువ‌తులు.. అమ్మాయిల ఫోటోలు సెల్‌ఫోన్లో ఉంచుకోవ‌డం త‌న అల‌వాటు అంటూ తేలిక‌గా పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాడు నిందితుడు. ఈ నేప‌థ్యంలో శ్రావ‌ణి హ‌త్య కేసు వెలుగులోకొచ్చిన రెండు మూడు రోజుల ముందు ఆ న‌ర‌రూప రాక్ష‌సుడు ఎవ‌రెవ‌రికి కాల్ చేశాడో అన్న కోణంలో కూడా విచారించారు పోలీసులు.


 ఆ కాల్ డేటా ఆధారంగా ఈ అమ్మాయిల‌కు.. శ్రీనివాస్‌రెడ్డికి.. హ‌త్య కేసుల‌కు ఏదైనా లింక్ ఉందా అన్న కోణంలో విచారించిన‌ట్లు స‌మాచారం. 
కాగా.. నిందితుడి మొబైల్ లో ఉన్న అమ్మాయిల పేర్ల‌ను శ్రీనివాస్‌రెడ్డి నుంచి తెలుసుకుంటూ.. వారి ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్ ఎకౌంట్ల‌ను కూడా పోలీసులు క్షుణ్నంగా ప‌రిశీలించారు. 


మ‌రోవైపు లిఫ్ట్ మెకానిక్‌గా శ్రీనివాస్‌రెడ్డి ప‌నిచేసిన క‌ర్నూలు, వేములవాడ ప్రాంతాల‌తో పాటు బొమ్మ‌ల‌రామారం, ఈసీఐఎల్, కీస‌ర‌, హ‌జీపూర్ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసుల‌తో సంబంధం ఉందా అన్న కోణంలో నిందితుడిని విచారించారు పోలీసులు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ మాత్రం రాలేద‌ని స‌మాచారం. 


ఇక ఐదు రోజుల క‌స్ట‌డీలో పోలీసులు మొద‌టి రెండు రోజులు రాత్రి పూట హ‌జీపూర్ స‌మీపంలో శ్రావ‌ణి, మ‌నీషా, క‌ల్ప‌న‌ల‌ను హ‌త్య చేసిన బావుల వ‌ద్ద సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేశారు పోలీసులు. దాని ద్వారా నిందితుడు ఈ హ‌త్య‌లు ఎలా చేశారో తెలుసుకున్నారు. 


ఈ నేప‌థ్యంలో పోలీసులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు నిందితుడు స‌మాధానం దాట‌వేసిన‌ట్లు తెలిసింది. నల్గొండ కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 8న వరంగల్ సెంట్ర‌ల్ జైలు నుంచి శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 రోజులపాటు హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో విచారించారు. 


కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కోర్టులో హాజరుపర్చారు. తిరిగి న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడ్ని వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: