దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే తెలంగాణ, ఎపిలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి.  కాగా ఈ నెల 23న జరిగే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి వచ్చే కౌటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేసి అందజేయాలని లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.   

కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నగరంలో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రక్రియ , పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. 

కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.ఉదయం 8గంటలకే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని అందువల్ల ఏజెంట్లుగా వచ్చే ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయం లో కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: