మే 23 దగ్గరకొస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈవీఎం బాక్సుల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంంది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన కేబినెట్ మీటింగ్‌ లో హాట్ హాట్ డిస్కషన్ సాగిందట. 


మే19 చివరి విడద ఎన్నికలు ముగియగానే.. అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి. వీటిలో చాలావరకూ వైసీపీ గెలుస్తుందని చెప్పే అవకాశాలే ఉన్నాయట. అందుకే.. వీటిని చూసి కంగారు పడవద్దని చంద్రబాబు మంత్రులకు  సలహా ఇచ్చారట. 

తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేలా గందరగోళ పరిచేలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కంగారు పడవద్దని ఆయన సూచించారట. టిడిపి తప్పకుండా గెలుస్తుందని ఆయన ధైర్యంగా చెప్పారట.  ఎన్డీయేకు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు అవకాశాలు కన్పించడంలేదని చంద్రబాబు అన్నారట. 

అంటే చంద్రబాబు ముందుగానే మంత్రులను ఓటమికి మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవును మరి ఓటమిని ఒక్కసారిగా జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమే. ముందే ఓటమికి ప్రిపేరై ఉంటే.. ఒకవేళ గెలిచినా ఇబ్బంది ఉండదు. ఓడినా.. ముందుగా అనుకున్నదేగా.. అంటూ బాధ కాస్త తగ్గించుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: