మే 23న ఏం జరుగుతుంది.. మోడీ మరోసారి ప్రధాని అయ్యేలా బీజేపీకి మళ్లీ మెజారిటీ సాధిస్తారా.. లేక కేంద్రంలో సంకీర్ణం దిశగా అడుగులు పడతాయా.. అన్నది ఆరోజే తేలుతుంది. కాంగ్రెస్ కు సింగిల్ గా మెజారిటీ వచ్చే అవకాశాలు ఏ  కోశానా కనిపించడం లేదు. 


అందుకే సోనియా గాంధీ.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలకూ  కూడగడుతున్నారు. మే 23న  భేటీ అయ్యేందుకు రావాలంటూ ఆమె వైసీపీ అధినేత జగన్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. 

చంద్రబాబు ఓపెన్‌ గా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. జగన్, కేసీఆర్ మాత్రం తమ స్టాండ్ ఎన్నికల ఫలితాల తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కుదిరితే మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలో వారికి సోనియా స్వయంగా లేఖ రాయడం టీడీపీని డిఫెన్సులో పడేస్తోంది. 

చంద్రబాబు ఒక్కడే కాగా.. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఓ జట్టుగా నడుస్తున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తే.. చంద్రబాబు కంటే వీరిద్దరిదే పైచేయి అవుతుంది. ఎందుకంటే.. ఈ రెండు పార్టీలకూ వచ్చే సీట్లు తప్పకుండా టీడీపీ కంటే ఎక్కువే ఉంటాయి. అదే జరిగితే కేసీఆర్ కీరోల్ పోషిస్తాడు. మరి ఇన్నాళ్లూ రాహుల్ గాంధీతో రాసుకుపూసుకు తిరిగిన చంద్రబాబు పరిస్థితి ఏంటన్నది చూడాలి. ఏదేమైనా 23న ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదే ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: