చాలాకాలానికి చంద్రబాబు మంత్రులు కలిసారు. ఈసీ అనుమతితో తూతూ మంత్రంలా మంత్రి వర్గం భేటీ నిర్వహించారు. అందులో నిర్ణయాలు ఏమీ లేవు. తుపాను, కరవు, నీటి కష్టాలు సింపుల్ అజెండావే. సరే కానీ ఆ తరువాత పూర్తిగా రాజకీయాల గురించే మాట్లాడుతున్నారంతా. చంద్రబాబు తన మనసులోని మాటలను మంత్రులకు చెబితే మంత్రులు మనమే గెలుస్తున్నాం సార్ అంటూ వూదరగొట్టారట.



ఇక డిల్లీలో మోడీ రాడు, మన ప్రభుత్వమే వస్తుందని బాబు పలు రకాల అర్ధాలు వచ్చేలా మాట్లాడారని టాక్. మన ప్రభుత్వంలో మోడీ లేని బీజేపీ కూడా ఉండే ఉండి ఉంటుందని తమ్ముళ్ళు కూడా రకరకాల  అర్ధాలు చెప్పుకున్నారట. ఇక ఈ నెల 23న ఫలితాల తరువాత చంద్రబాబు ఢిల్లీలో తెగ బిజీ అవుతారని కూడా మంత్రుల చర్చలో వచ్చిందట. అందువల్ల మహానాడుని రద్దు చేయాలని అనుకున్నారు. దానికి బదులుగా అన్న గారి జయంతిని సాదా సీదాగా నిర్వహించి మమ అనిపించేస్తారట.



సరే ఇన్ని విషయాలు మాట్లాడుకున్నారు కదా. మరి టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎపుడు, ఆ తేదీల గురించి ఎందుకు మాట్లాడుకోలేదన్న చర్చ ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఢిల్లీలో బాబు గారు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటున్న తమ్ముళ్ళు ఏపీలో బాబు పాత్ర ముగిసినట్లేనని చెప్పకనే చెబుతున్నారా అన్న  డౌట్లు లెక్కలేనన్ని పుట్టుకువస్తున్నాయి. మొత్తానికి చివరి మంత్రి వర్గ సమావేశం ఎటువంటి జోష్ లేకుండా ముగిసిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: