Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:58 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియల్: వైఎస్ జగన్ కాలకూట విషాన్ని పిండ గలడా! కౌంట్-డౌన్ మొదలైంది

ఎడిటోరియల్: వైఎస్ జగన్ కాలకూట విషాన్ని పిండ గలడా! కౌంట్-డౌన్ మొదలైంది
ఎడిటోరియల్: వైఎస్ జగన్ కాలకూట విషాన్ని పిండ గలడా! కౌంట్-డౌన్ మొదలైంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్రబాబు చిమ్మిన కాలకూట విషం – వంద రెట్లు ప్రచారం చేసిన సామాజిక వర్గ  మీడియా – నాటి కేంద్ర రాష్ట్రాలాడిన డ్రామా!  "ఒక అబద్ధం పదిసార్లు చెపితేనే నిజమై పోతుందనేది జగమెరిగిన గోబెల్స్ సూక్తి" అదే ప్రతిరోజు, పదులసార్లు, పదుల సంవత్సరాలు చెపితే దాని ప్రభావం ఒక యువ రాజకీయ నాయకుని జీవితం భూస్థాపితం" అయితే ఆ నాయకుడు ఒక మట్టి ముద్దైతే చంద్రబాబు, సోనియా గాంధిల కోరిక నెఱవేరుతుంది. కాని రబ్బర్ బంతి అయితే ఎగిరెగిరి నింగిని తాకి నేలపై పడి అక్కడ అదే భువిపై అధికారం చెలాయించడా?  ఋజువు చూడటానికి నిరీక్షిద్ధాం!  
punishment-for-a-decade-of-political-fraud
బాబు చిమ్మిన విష-పాపాగ్ని నిలువరించటానికి కావలసింది పట్టుదల దానిని బాలన్స్ చేయటానికి సహనం అవసరం. గత ఐదేళ్ళలో అధికారంలో ఉండి కోటాను కోట్ల రూపాయలు దోచేశారనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని కాలసర్పంలా చుట్టేసింది. చంద్రబాబు నాయకత్వంలో నీతి, "నేతి బీరకాయలోని నెయ్యంత!"  అని చూపరులకు కనిపిస్తూనే ఉంది.
punishment-for-a-decade-of-political-fraud
చంద్రబాబు మరియు ఆయన కుల, ఆశ్రయించిన మూక కూడా ప్రభుత్వాలు మారగానే ఆర్ధికనేరాల ఊబిలో చిక్కుకోవాల్సిందే,కేసులుఎదుర్కోవాల్సిందే అంటు న్నారు ఆర్ధిక నిపుణులు.  తాతకు పెట్టిన బొచ్చె తాలాపిననే ఉంటుంది కదా!


ఈ మద్యననే మాజీ సిబీఐ జాయింట్ డైరెక్టర్, నేటి జనసేన నేత విశాఖ పార్లమెంట్ అభ్యర్ధి వి వి లక్ష్మినారాయణ,  ఒకే ఒక్క వ్యాఖ్యతో తెలుగు దేశం పార్టీ దాని అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన కుల రాజకీయ పరివార మూక - ప్రతిపక్ష వైఎస్ జగన్మోహనరెడ్దిపై చేస్తూ వచ్చిన ఆరోపణలలో సింహభాగం నిజం కాదని తేల్చి పారేశారు. బహిరంగంగా తేలిపోయింది. 

ముఖ్యంగా జగన్ చేసిన లక్షలకోట్ల అవినీతి అంటూ ఇంతకాలం చేసిన విషప్రచారం అంతా వారిస్వార్ధం కోసం వైఎస్ జగన్ ను రాజకీయంగా భూస్థాపితం చేయటం కోసం  చంద్రబాబు పరివ్రాజకం చిమ్మిన విషకెరటమని తెలుస్తుంది. దాదాపు ఒక దశాబ్ధ కాలం ఇలాంటి అర్ధసత్యాలు, అసత్యాలు, అబద్ధాల ప్రచారం కొనసాగిస్తూ చంద్రబాబు ఆయన పార్టీ ప్రజలను నిట్టనిలువునా మోసగిస్తూ తన స్వకుల జనానికి జాతి సంపదను దోచిపెట్టటం ద్వారా అధికారంలో కొనసాగారు. 
punishment-for-a-decade-of-political-fraud
ఈ విషాగ్నికి చంద్రబాబు — స్వసామాజిక వర్గ మీడియా (తెలుగు ప్రధాన పత్రికలు, టెలిజన్ చానళ్ళు)  అవసరానికి ప్రచారరూపంలో ఆజ్యంపోస్తూ,  విషాన్ని కాలకూట కేరటంలా చేసి జాతి జనులను తప్పు దారి పట్టించిన నేఱానికి గాను తగిన శిక్ష అనుభవించే అవకాశాలు ముమ్మరంగానే కనిపిస్తున్నాయి. ఛంద్రబాబు అధికారం కోల్పొవటం తధ్యమని జాతీయ మీడియా కోడై కూస్తుంటే ఈ పచ్చ మీడియా మాత్రం చంద్రబాబు తను చెప్పే తన పార్టీ గెలుపును మాగ్నిఫై చేస్తూ ప్రచారం చేస్తున్న నేరానికి ప్రతిఫలంగా టిడిపి ప్రభుత్వం ప్రకటనలు, యాడ్స్, భూసంపద తదితర ప్రయోజనాలను అందిస్తూ దానికి ప్రాణవాయును ఇస్తూ వచ్చిందింతవరకు.

నాటి  ఈ పత్రికలు చేసిన విషప్రచారంతో జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన అదీ ఎన్నికలు పూర్తై, ప్రజాభిప్రాయం ఈవీఎంలలో నిక్షిప్తమైన తరుణంలో మాత్రమే, నిజం బయట పెట్టారు. అసలు నిజం యదార్ధం అదీ ఆరోపణలతో  బేరీజు వేస్తే దాని పరిమాణం "హస్తి ముందు మశాంతకమంత. సముద్రంలో బిందువంత భూగోళంలో పిపీలికమంత.     
punishment-for-a-decade-of-political-fraud
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసి అందరిలో తన కీర్తి ప్రతిష్టలు పెంచుకున్న లక్ష్మీనారాయణ, తాజాగా ఆ కేసుకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు ఊరికే పోవు. 

అంతేకాదు జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనడం రాజకీయ ఆరోపణేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు లభించిన ఆధారాల ప్రకారం జగన్‌ ₹1366 కోట్ల మేరకే అవినీతికి పాల్పడ్డట్లు అభియోగాలకు ఆధారాలు ఉన్నాయని, తాము చార్జ్‌షీట్‌ లో పొందుపరిచామని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీనారాయణ లక్షకోట్లు దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం దాటవేశారు. రాజకీయ ఆరోపణలను తాను బాధ్యుడను కానని వాటిని తాను ఖండిస్తూ కూర్చోలేనని చెప్పుకొచ్చారు. 

జగన్ కేసులను కొందరు నేత‌లు రాజకీయంగా వాడుకుని ఉంటే అందుకు తాను బాధ్యుడనుకానని స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.  నాటి జేడీకి జాకీలేసి పైకిలేపి ఇచ్చిన ఈ పచ్చ ప్రచారం నేడు ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు పునాది అన్న విషయం మరచిపోరాదు. ఈయన్ని మించిన నీతిమంతులు ఆసేతు శీతాచలం కోకొల్లలు. కాని వాళ్లను జాకీలేసి లేపేవాళ్లు లేరు. 
punishment-for-a-decade-of-political-fraud
తండ్రి చంద్రబాబు కంటే తనయుడు చిన్నబాబు ( లోకెష్ ) నాలుగడుగులు ముందుకు వేసి -— లక్ష కోట్లంటే ఎన్ని టంక్ బాక్సుల్లో నోట్ల కట్టలు పేర్చొచ్చో ఆ బాక్సుల ఘన పరిమాణం కూడా తనకున్న గణిత పరిఙ్జానం వాడేసి మరీ లెక్ఖించి సామాన్య పామర జనానికి అర్ధమయ్యే పరిభాష లోకి తర్జుమా చేసి ప్రచారం చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయనకు ఆ పరిఙ్జానం ఉందంటే నమ్మలేము. ఎవరో బాబు మెప్పుపొందటానికి ఆయనతో ఆయా ప్రకటనలు చేయించి జాకివేసి పైకి లేపారు తప్ప మరేమీ కాదు. 


ఇంకా చెప్పాలంటే ₹1366 కోట్లు సైతం ఇప్పటికీ ఆరోపణలే.  "క్విడ్ ప్రొ కో"  అంటూ వాడిన పదజాలం నిర్వచనంతో సహా ఇంకా ఋజువు కావలసి ఉంది . కాకపోతే తెలుగుదేశం పార్టీ, దాని మద్దతు మీడియా చల్లిన బురద, చిమ్మిన విషం, గోబెల్ సూక్తిని అనుసరించి జనంలోకి తీసుకెళ్ళి జగన్మోహనరెడ్డిని పూర్తిగా అభాసు పాల్చేసిన విధానంతో జరిగిన ప్రచారం ఒక యువ నాయకుని రాజకీయ పరుగును ఒక దశాబ్ధ కాలం నిలిపివేసింది.

punishment-for-a-decade-of-political-fraud

చేసిన పాపం కట్టి కుడుపుతుందనటం లోకొక్తి. అదే ఇప్పుడు టివి9 మాజీ సీఈవో సతతం కుల జాడ్యం అనే రోగ పీడితుడుగా బ్రతికిన పాతకం రవిప్రకాష్ జాతకం, బయటపడి బ్రతుకు జీవుడా! అన్నట్లు అఙ్జాతంలో బ్రతుకుతున్నాడు. నేడో రేపో చెరసాల పాలుగావటమే తరువాయి. అలాగే ఈ పచ్చమీడియాలో ఒక్కొక్కరు జరగనున్న విచారణలలో క్రమంగా బయటపడక తప్పదు. 
punishment-for-a-decade-of-political-fraud
జేడీ లక్ష్మినారాయణను జాకిలేసి లేపిందీ ఈ హల్దీ మీడియానే. ఆయన టిడిపిలో కాకుండా జనసేనలో చేరటంలో జాకీలేయటం కాదు మామూలు ప్రచారం కూడా  ఆపేసిందీ ఈ హల్దీ మీడియానే. వాళ్ళకు కావలసినప్పుడు జాకీ లేసి లేపుతారు అవసరం లేకపోతే పాటాళంలోకి నెట్టేస్తారు. ఇది పవన్ కళ్యాన్ విషయంలో పలుమార్లు ఋజువైంది కూడా!  
punishment-for-a-decade-of-political-fraud
ఉమ్మడి రాష్ట్ర సీఎస్ రామాకాంత్ రెడ్డి చెప్పిన నిజాలు వింటే జగన్మోహనరెడ్ది చుట్టూ నాటి కేంద్రంలో అధికారం చలాయించిన రాజకీయ పార్టీ - కాంగ్రెస్, రాష్ట్ర పాలన చేస్తున్న రాజకీయ పార్టీ-తెలుగుదేశం , రాష్ట్ర ప్రధాన మీడియా అంటే పచ్చమీడియా కలసి పన్నిన ముక్కోణ ముట్టడి మాయాజాలమే ఈ ఆరోపణలు అనితెలుస్తుంది. 


అనుభవఙ్జుడు, మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్ది అసలు విచారణ జరిగిన తీరునే కాదు - మీడియా వేషాలపై సున్నితంగా చురుక్కుమనిపించే చెమక్కులైన మాటలతో విచారణలోని మాయమర్మాన్ని ఎత్తి చూపారు.
punishment-for-a-decade-of-political-fraud
బహుశ మే 23 నాడు వెలువడనున్న సార్వత్రిక మరియు శాసనసభ ఎన్నికల పలితాలు మాత్రమే \ఇంత వరకు టిడిపి జరిపిన విషప్రచారానికి శిక్ష విధించబోతున్నట్లు తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఏంతవరకు ఈ లక్షల కోట్ల జాతి ధన దుబారాను బయటకు తీస్తాడో? వీరి నేతి బీరకాయలోని అవినీతి విషాన్ని కక్కిస్తాడో? ఆయన సామర్ధ్యానికి అగ్ని పరీక్షే.   
punishment-for-a-decade-of-political-fraud
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పులు ₹250000 కోట్లకు చేరాయి! ఏపి ప్రస్తుతం అప్పుల కుప్ప
చంద్రబాబుపై జగన్ తొలి అస్త్రం ఏమిటో తెలుసా? తెలుసుకోండి!
తెదేపా పతనానికి నాడే పడ్డ పునాదులు - ఇక జగన్ జనం నమ్మకం నిలుపుతారనే నమ్ముదాం!
టిడిపి కుటుంబ ప్యాకేజీలకు వారసులకు వైసిపి సునామిదెబ్బ
జగన్ ప్రభుత్వం: సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం - సలహాదారుగా అజయ్ కల్లాం
నందమూరి కుటుంబానికి ఇంకొంత గౌరవం ఉన్నట్లే ఉంది-నారా కుటుంబం తుడిచిపెట్టుకు పోయింది
అవినీతి అక్రమాలే చంద్రబాబును టిడిపిని నిట్టనిలువుగా ముంచేశాయి
తాజెడ్డ కోతి వనమెల్ల చెరచు అన్నట్లు బాబు తనతో పాటు కాంగ్రెస్ నూ చెరిచారు!
కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!
కౌగిలించుకొని కాంగ్రెస్ కొంప ముంచాడు నవజ్యోత్ సింగ్ సిద్దు! కెప్టెన్ అమరిందర్ సింగ్
బ్రేకింగ్ న్యూస్ : రాహుల్ గాంధిని ఆల్ టైమ్ రికార్డుతో గెలిపించిన దక్షిణాది - ఉత్తరాది తన్నేసిందా!
కేసీఆర్! రాష్ట్ర పాలన సరిగా చూడు! దేశం సంగతి మేం చూసుకుంటాం! తెలంగాణా జనం
మట్టిలో మాణిక్యం టీఅరెస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు!  బామ్మర్ధి కేటీఆర్ ఖేల్ ఖతం!
ఏపిలో వైసీపికి లాండ్ స్లైడ్ విజయం-దేశమంతా బీజేపి నిశ్శబ్ధ విప్లవం-చంద్రబాబుకు చరమగీతం
వారసుల గోల ఎక్జిట్-పోల్స్ లీల! ముఖ్యమంత్రుల తనయులు కర్ణాటక - ఏపిలో ఓడిపోవడం గ్యారెంటీ!
అబద్ధం (అసత్యం) చెప్పవచ్చట – ఆ సందర్భాలు ఏవంటే!
“ఎన్నికల రిగ్గింగ్‌ లో సుప్రీం కోర్టు ప్రమేయం ఉందేమో?”  కాంగ్రెసోళ్ళు ఇంతకు తెగించారు!
చంద్రబాబుకు షాక్: రేపటితో కర్ణాటకంలో కుమార ప్రభుత్వం పతనమేనా?
 "ఓటేసిన వేటు దెబ్బ" చంద్రబాబుకు తెలిసే సుదినం రేపే! దిమ్మతిరిగి బొమ్మ కనిపించేనా!
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
About the author