తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది డబ్బు సంపాదించే క్రమంలో ఇత దేశాలకు వలస వెళ్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో వలస కూలీలపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి.  కొన్ని సార్లు అక్కడ వీరిపై నేరారోపణలు చేసి జైళ్లలో పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  కర్మకాలి అక్కడ చనిపోతే మృతదేహం రావడానికి కూడా నెలలు పట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి.  


తమ కష్టాలు గట్టెక్కుతాయి..అంతో ఇంతో సంపాదించుకుందాం అని ఎంతో మంది యువకులు, మద్య వయస్కులు సౌది, దుబాయ్, కువైట్, మస్కట్ ఇలా విదేశాలకు వెళ్తుంటారు. అయితే వీరి పాస్ పోర్ట్ నుంచి అక్కడ కంపెనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాదే అని ఎంతో మంది బ్రోకర్లు అమాయకులను బురిడీ కొట్టించి..తీర అక్కడికి వెళ్లిన తర్వాత చేతులెత్తేస్తారు.

తాజాగా  సౌదీలో ఓ యువకుడు ఇలాగే ఓ బ్రోకర్ చేతిలో మోసపోయి తను చంపేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ కి వీడియోలో మొరపెట్టుకున్నాడు.  'బ్రోకర్‌ చెప్పిన మాటలు నమ్మి దేశం కాని దేశం వచ్చానన్నా. సంబంధం లేని పని అప్పగించడంతో ఎడారిలో గొర్రెలు మేపుతూ అవస్థలు పడుతున్నా. ఏజెంటు మోసంతో నరక యాతన అనుభవిస్తున్నా.

ఇరవై రోజులుగా సరైన తిండిలేదు. సౌదీలో నన్ను సంపుతుండ్రు. మీరు ఆదుకోకుంటే ఇవే నాకు చివరి రోజులులాగా ఉన్నాయి’ అంటూ ఆ వీడియోలో సమీర్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ వీడియో చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి..సౌదీలో ఉన్న భారత్‌ ఎంబసీకి సమీర్‌ గోడును నివేదించి అతను భారత్ కు వచ్చేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: