ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తోన్న హంగామా, హ‌డావిడి మామూలుగా లేదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంల‌ను క‌లుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య దేశంలో ఎన్డీయే, యూపీయే ప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి చ‌ర్చించారు.


రేప‌లి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత దేశంలో అటు ఎన్డీయేకు గాని, ఇటు యూపీఏకు గాని ప్ర‌భుత్వం ఏర్పాటుకు స‌రిప‌డినంత మెజార్టీ రానిప‌క్షంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని క‌లిపి ఓకే తాటిమీద‌కు రావ‌డంతో పాటు మ‌న‌కు కావాల్సిన నిధుల‌తో పాటు పెద్ద ప‌ద‌వుల‌ను కూడా సాధించుకోవాల‌ని స్టాలిన్‌కు చెప్పారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏపీ ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. ఏపీ ఎన్నిక‌ల‌పై కేసీఆర్ స్పందిస్తూ ఏపీలో మీరు అనుకుంటున్న‌ట్టు చంద్ర‌బాబు గెల‌వ‌డం లేదు... అక్క‌డ జ‌గ‌న్ గెలుస్తున్నార‌ని చెప్పిన కేసీఆర్‌... జ‌గ‌న్‌కు 18 నుంచి 21 వరకూ ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు అన్నాడీఎంకే వ‌ర్గాలు చెప్పాయి. 


ఈ విషయాలన్నీ మంగళవారం చంద్రబాబుకు దొరై మురుగన్‌ వివరించారు. విజ‌య‌వాడ వ‌చ్చిన దొరై చంద్ర‌బాబును క‌లిసి ఈ విష‌యాలు వెల్ల‌డించారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితిని, ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకొన్నారు. అదే టైంలో జ‌గ‌న్ 120 సీట్ల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి అవుతున్న విష‌యాన్ని కేసీఆర్ స్టాలిన్‌కు చెప్ప‌గానే స్టాలిన్ కాస్త విస్మ‌యం వ్య‌క్తం చేసిన‌ట్టు కూడా టాక్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: