Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 11:00 pm IST

Menu &Sections

Search

అదుగో పులి, ఇదుగో నక్క...!

అదుగో పులి, ఇదుగో నక్క...!
అదుగో పులి, ఇదుగో నక్క...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి...లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లుగా భ్రమింపజేస్తున్నారు.  ముఖ్యంగా మీడియా ఛానల్స్ లో ఒక ఛానల్ లో ఒక విషయం వస్తే..అదే విషయం పక్క ఛానల్ లో మరో రకంగా వస్తుంటింది..అంకెల విషయాల్లో కూడా తారుమారు..బేజారు. 

ఉదా..ఒక భారీ రోడ్డు ప్రమాదంలో పది మంది అని ఒకరు..లేదు ఇరవై మందని మరొక ఛానల్..అబ్బే ప్రమాదం నుంచి అందరూ బతికి బయట పడ్డారని మరొక ఛానల్..ఇక టీవీ ముందు కూర్చున్నవారి పరిస్థితి అగమ్య గోచరం..


తెలుగు రాష్ట్ర ప్రజల ప్రస్తుత పరిస్థితి  మతిలేని మీడియా మాధ్యమాల వల్ల ఇప్పుడు అదుగో పులి ఇదుగో నక్కలా తయారయింది. నిన్న మొన్నటిదాకా అదుగో ఇంటర్ పరీక్షా ఫలితాల గోడు, ఇప్పుడేమో ఇదుగో టీవి9 రవిప్రకాష్ ఫ్రాడూ... ఇవి తెలుగు వార్తా మాధ్యమాల అగచాట్లు. 


పది సెకన్ల విజువల్ దొరికితే పది గంటలుదాకా అదే వార్త నడిపే ఈ వార్తా మాధ్యమాలు జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చూపిస్తారో లేదో కాని జరగని కల్పనను మాత్రం ప్రజల నెత్తిన రుద్దడానికి మా బాగా ప్రయత్నిస్తారు.

అలాగే ప్రజల మతిని మసి పూసి మారేడు కాయ చేసి వారి ఆలోచనలను మసకబారుస్తారు. దీనికి ఉదాహరణ గడిచిన ఈ నెలరోజులే. ఓ పక్క ఎన్నికల హడావిడి తగ్గకముందే ఇంటర్ ఘోరాన్ని మనం చవి చూశాం.  ఆ ఘోరానికి సంబంధించిన వివరాలు రవిప్రకాష్ విషయం తరువాత మరుగున పడ్డాయి.


media-channles
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Harikrishna Inturu a 20 year professional media journalist, His writings endeavor with a satirical ting for any type of articles. His pen name is well known as VISHAYA VIMARSAKUDU