Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:59 pm IST

Menu &Sections

Search

ఫ్రంట్ పాట్లు‌ - కూర్పు కసరత్తలు..

ఫ్రంట్ పాట్లు‌ - కూర్పు కసరత్తలు..
ఫ్రంట్ పాట్లు‌ - కూర్పు కసరత్తలు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫెడరల్ ప్రంట్.. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి రావాలి.. దేశ స్తితిగతులు మారాలంటూ.. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు‌ రాజేసిన ఫ్రంట్ పాఅలిటిక్స్ ఇప్పుడు దేశంలోనే "బర్నింగ్" ఇష్యూగా మారాయి.   పైసలుమావి.. పెత్తనం‌మీదా .. ప్రాంతీయంగా మాకూ బలముంది.. మేమంతా ఏకమవుతాం.. దేశాని ఏలుతాం.. జాతీయ పార్టీలుగా దేశానికి పట్టిన కాంగ్రెస్, బీజెపి దరిద్రాలకు చెరమగీతం‌ పాడతాం ఇదే స్లోగన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు.. ఇటు కేసీఆర్ దేశాన్ని చుట్టేస్తున్నారు. విడల వారీగా.. ఆయా రాష్ర్టాల్లో పర్యటిస్తూ..ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు.‌


మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం‌ కేసీఆర్ కేరళ , తమిళనాడు లలో పర్యటించి అయా రాష్ర్టాల ముఖ్య‌నేతలు పినరయ్ విజయన్, స్టాలిన్ వంటి‌నేతలను‌ కలిసి ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరిన‌ సంగతి తెలిసిందే..  అయితే అంతకు‌ముందే  యూపీ , వెస్ట్ బెంగాల్ , బీహార్లలో పర్యటించిన కెసిఆర్ తృణముల్ మమతా బెనర్జీ, ఎస్పీ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అదినేత మాయవతి ని కలిసి ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతివ్వాలని కోరారు.‌
   
అలాగే ఏపీ‌సీఎం చంద్రబాబు సైతం ధర్డ్ ఫ్రంట్ పాటే పాడుతున్నాడు. బీజేపీ హటావో‌ దేశ్ బచావో అన్న‌నినాదంతో  కాంగ్రెస్ తో కూడిన ‌కూటమి కి‌ మద్దతు కూడగడుతున్నాడు.‌  అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ కర్ణాటక, యూపీలలో‌పర్యటించిన బాబు ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఇదిలా ఉంటే తాజాగా.. బీజేపీ యేతర కూటమికు నా ఫుల్ సపోర్ట్ అంటోంది కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ.


రేపు ‌యాంటీ బీజేపీ పార్టీల నేతలతో‌ చర్చలు జరిపేందుకు సిద్దమైంది.‌ అయితే ఇప్పుడిదే తెలంగాణలో‌ వివాదాస్పదం అవుతోంది.  సోనియా గాంధీ తాను నిర్వహించబోయే  బీజేపీయేతర సమావేశానికి తెలంగాణ సీఎం‌ని కూడా ఆహ్వానించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.‌ ఈ‌ రూమర్స్‌ని టీఆర్ఎస్  నేతలు  తప్పుబడుతున్నారు.


దేశంలో కాంగ్రెస్, బీజేపి లేని ప్రత్యామ్నాయ శక్తికోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ కు సోనియా మీటింగ్ ఎలా ఆహ్వ‌నం‌ అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం కాంగ్రెస్, బీజేపిలు చేస్తున్న‌కుట్ర పూరిత ప్రచారమే అంటున్నారు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాల‌‌కు సమయం దగ్గర పడుతున్న వేళ... తెలుగు రాష్ట్రా ముఖ్యమంత్రులు... కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేస్తున్న ఫ్రంట్ ప్రయత్నాలు మరింత పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.


ap-election-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

With publishers emphasizing platform to ascertain evidence of future sales, blogging your novel can be much more lucrative than you think. Blogging is still considered to be one of the greatest ways to expand your reach.