దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న టీవీ9 యజమాన్య వివాదంలో ఫోర్జరీ కేసులో ఇరుక్కున్న మాజీ సీఈవో రవిప్రకాశ్ విష‌యంలో ప‌రిణామాలు ఊహించ‌ని రీతిలో మారుతున్నారు. ఫోర్జరీతో పాటు డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇప్పటి వరకు ఆయన నోటీసులపై స్పందించలేదు. గడువు కూడా ముగియడంతో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


బుధవారం ఉదయం పదకొండు గంటలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సి ఉంది. అయితే.. ఆ సమయానికి ఆయన హాజ‌రు కాలేదు. మ‌రోవైపు, ఆయ‌న‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ రవిప్రకాశ్ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. దీనిపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 
కాగా, రవిప్రకాశ్.. ఏపీలో తలదాచుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. రవిప్రకాశ్ ఫోర్జరీ చేశాడని చెప్తున్న సంతకంతోపాటు ఫోర్జరీకి గురైన వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇదివరకే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక కూడా తెప్పించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటే పోలీసులకు దొరుకడం ఖాయమని రవిప్రకాశ్ భావించి, ఏపీకి వెళ్లిపోయారని చెప్తున్నారు. అక్కడి ప్రస్తుత అపద్ధర్మ ప్రభుత్వ పెద్దలతో తనకున్న సత్సంబంధాలతో అక్కడే కొన్నాళ్లు తలదాచుకోవాలని రవిప్రకాశ్ భావిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు న్యాయసలహా తీసుకొని, అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు... ఏపీలో తలదాచుకుంటున్నారని తెలుస్తున్నది. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరుకావాల్సి ఉన్నది. అయితే.. ఆ సమయానికి ఆయన వస్తారా? రారా? అనే విషయంలో చర్చ జరుగుతున్నది. సంతకాల ఫోర్జరీపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదుచేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఫిర్యాదుదారుడు అందించిన ఆధారాలను వాటితో సరిపోల్చడంతోపాటు.. రవిప్రకాశ్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలనే అంశాలపై ఇప్పటికే సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రశ్నావళిని సిద్ధంచేసుకున్నారని తెలుస్తున్నది. విచారణలో ఆయన వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: