టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. బయటకు వస్తే ఎక్కడ తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారో అన్న ఆందోళనలో ఉన్న రవిప్రకాశ్.. న్యాయపోరాటం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో చెప్పింది. 


అజ్ఞాతంలోనే ఉన్నా.. రవిప్రకాశ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఇటీవల తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రత్యేక కార్యక్రమం చేశానని.. అది చూసిన తెలంగాణ పెద్దలు తనపై కక్ష కట్టారని రవిప్రకాశ్ చెప్పుకొచ్చారు. అందుకే తనను టీవీ నైన్ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

ఈ ఇంటర్వ్యూ ద్వారా రవిప్రకాశ్ నేరుగా కేసీఆర్‌ నే డీకొనేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. కానీ రవి ప్రకాశ్ వాదన అంత సబబుగా లేదు. తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు జరిగింది ఈ నెల రోజుల్లోనే.. కానీ టీవీ9 ను అలంద మీడియా టేకోవర్ చేసి ఏడాది అయ్యింది. 

ఏడాది క్రితమే ఛానల్ లో 90 శాతం వాటాలు కొనుక్కున్న వారి ఇష్టప్రకారం కాకుండా మైనారిటీ షేర్ హోల్డరైన రవిప్రకాశ్ ఇష్టానుసారం ఛానల్ ఎలా నడుస్తుందన్న విషయం రవిప్రకాశ్ కు తెలియంది కాదు. కానీ మొత్తానికి విద్యార్థుల ఆత్మహత్యల తర్వాతే కేసీఆర్ కు కోపం వచ్చి రవిప్రకాశ్ ను బయటకు పంపే పని వేగవంతం చేసి ఉండొచ్చన్నది మీడియా వర్గాల కథనం. ఏదేమైనా రవిప్రకాశ్ ఇంటర్వ్యూ టార్గెట్ మాత్రం కేసీఆర్ గానే కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: