అజ్ఞాతంలో ఉండి ఓ పత్రిక కు ఇంటర్వ్యూ ఇచ్చిన టీవీ నైన్ మాజీ సీఈవో రవిప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తన సన్నిహితుడైన పారిశ్రామిక వేత్త రామేశ్వరరావుతో ప్రయత్నించారని ఆరోపించారు. రాజకీయ ఎజెండాతోనే రామేశ్వరరావు టీవీ నైన్‌ను కొన్నారని విమర్శించారు. 


2018 సెప్టెంబరులో తాను అమెరికాలో ఉన్నానని.. ఆ సమయంలో తనకు న్యూస్ రూమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా రవిప్రకాశ్ చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ రైడ్స్ జరిగాయని.. ఆ వార్తను ఎలా కవర్ చేయాలో రామేశ్వరరావు కుమారుడు.. సోదరుడు డిక్టేట్ చేస్తున్నట్లుగా ఆఫీసు నుంచి ఫోన్ చేసి చెప్పారట. 

రేవంత్ రెడ్డికి రామేశ్వరరావు వారు రాజకీయ శత్రువు కావటంతో ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారు ప్రయత్నించినట్లుగా రవిప్రకాశ్ వివరించారు. దీని ప్రకారం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ రామేశ్వరరావును వాడుకున్నారని రవిప్రకాశ్ చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. 

న్యూస్ ఛానళ్లలో, పత్రికల్లో జర్నలిస్టులు తమంతట తాము నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేవు. యాజమాన్యం సూచనలకు అనుగుణంగానే వార్తా కథనాలు ఉంటాయి. తెలుగులు దీనికి మినహాయింపు ఉన్న వార్తా సంస్థలు చాలా అరుదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: