ఇపుడిదే సందేహం అందరిలోను మొదలైంది. ఎన్నికలకు ముందు కొన్ని జాతీయ మీడియా సంస్ధలు సర్వేలు నిర్వహించాయి. వాటిల్లో వైసిపిదే అధికారం అని తేలింది. దాంతో ఆ సర్వేలన్నింటినీ జగన్ డబ్బులిచ్చి చేయించుకున్నట్లుగా ఎదురు దాడి చేశాయి. నిజానికి డబ్బులిచ్చి ప్రోపోల్ సర్వే చేయించదలుచుకుంటే ఎన్ని సంస్ధలను మ్యానేజ్ చేయాలి జగన్ ?

 

తమకు వ్యతిరేకంగా సర్వే ఫలితాలున్నాయి కాబట్టి అవన్నీ జగన్ డబ్బులు చేయించుకున్నట్లు చంద్రబాబునాయుడు అండ్ కో తేల్చేశాయి. ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలను కూడా పట్టించుకోవద్దని తాజాగా చంద్రబాబు తేల్చేశారు. క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ టిడిపికి వ్యతిరేకంగా వస్తాయని ముందుగానే చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

19వ తేదీ సాయంత్రం కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడే అవకాశం లేదు. అయినా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ టిడిపికి వ్యతిరేకంగానే ఉంటాయని చంద్రబాబుకు ఎందుకు అనుమానం వచ్చిందో తెలీటం లేదు. ప్రీపోల్ సర్వేలను నమ్మరు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా నమ్మవద్దని చంద్రబాబు చెబుతున్నారు.

 

చంద్రబాబుకు మొదటినుండి ఓ అలవాటుంది. తనకు అనుకూలంగా వస్తేనేమో జనాలిచ్చిన తీర్పు. వ్యతిరేకంగా వస్తే మాత్రం ప్రతిపక్షాల కుట్ర. అంటే కిందపడ్డా పై చేయి నాదే అనే రకమన్నమాట. జాతి మీడియా బలం ఉంది కదా ఏం మాట్లాడినా చెల్లుబాటైపోతోంది.  ప్రీ పోల్ సర్వే సరే ఎగ్జిట్ పోల్ ఫలితాలూ సరే కనీసం 23వ తేదీ కౌంటింగ్ లో వచ్చే ఫలితాలనైనా చంద్రబాబు అంగీకరిస్తారా ? అన్న చర్చే ఇపుడు టిడిపిలో హాట్ టాపిక్ గా మారింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: