జగన్ మోహన్ రెడ్డి .. ఏపీకి కాబోయే సీఎం అని అన్ని సర్వేలు తేల్చెచేశాయి. పైగా జగన్ కూడా ఈ సారి ఖచ్చితంగా సీఎం అవుతానని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. అయితే సోనియాగాంధీ స్వయంగా జగన్ కు లేఖ రాశారు. ఫలితాల అనంతరం ఢిల్లీకి రావాలని - తమ కూటమి మీటింగులో పాల్గొనాలని జగన్ మోహన్ రెడ్డి కి సోనియాగాంధీ లేఖ రాసింది. ఈ మేరకు ఈ అంశాన్ని జాతీయ మీడియా కూడా ధ్రువీకరిస్తూ ఉంది. 


ఇలా జగన్ ముందు కాంగ్రెస్ పార్టీ మోకరిల్లినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీని సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీలో ఎన్డీయేతర - యూపీఏ - తటస్థ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సోనియాగాంధీ భావిస్తోంది. అందుకే ఆయా పార్టీల వాళ్లను ఆహ్వానిస్తే ఆమె లేఖలు రాశారు. అందులో భాగంగా జగన్ ను కూడా ఆహ్వానించారు. ఈ మేరకు కథనాలు వస్తూ వున్నాయి.


ఎలాగైనా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్న సోనియాగాంధీ ఇలా ఫలితాల వెల్లడికి ముందే ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా ఒకప్పుడు తాము తీవ్రంగా ద్వేషించిన జగన్ కు కూడా ఆమె లేఖ రాశారు.మరి సోనియాగాంధీ ఆహ్వానం మీద జగన్ ఏమనుకుంటున్నారు? సోనియా నిర్వహించే సమావేశానికి ఆయన హాజరవుతారా? అంటే.. ఆ సమస్యే లేదు అని అంటున్నాయి వైఎస్సార్సీపీ వర్గాలు. సోనియా గాంధీ పంపిన ఆహ్వాన పత్రాన్ని జగన్ బుట్ట దాఖలు చేశారని.. ఆ సమావేశానికి హాజరయ్యే ఉద్దేశం జగన్ కు లేదని వైఎస్సార్సీపీ నుంచి సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: