ఏపీ సర్కారు కొద్ది రోజుల్లో గద్దె దిగబోతోంది. జనం గెలిపిస్తే మళ్లీ సీఎంగా చంద్రబాబు కొనసాగుతారు. ఈ కొద్ది సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ కీలక పదవిని చంద్రబాబు సర్కారుకు తమకు నచ్చిన వ్యక్తికి కట్టబెట్టేసింది. కనీస నైతిక ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకుంది. 


విజయవాడలోని హోటాల్ యజమాని ఐలాపురం రాజాను ఏపీ సమాచార హక్కు కమిషనర్ గా నియమించింది. సాధారణంగా ఈ పదవికి విద్యాధికులు, మేథావులు, ప్రజాసేవలో ఉన్నవారిని పరిశీలించి నియమిస్తారు. సమాచార హక్కు ఎంత విశిష్టమైందో అందరికీ తెలిసిందే. 

అలాంటి కమిషనర్ పదవిని ఓ హోటల్ యజమానికి కట్టబెట్టడం వివాదస్పదమైంది. ఈ విషయంపై జన చైతన్యవేదిక హైకోర్టులో పిటీషన్ వేసింది. హోటల్ యజమాని ఆ పదవికి అనర్హులని ఫిర్యాదులో పేర్కొంది.  సెక్షన్‌-50లోని క్లాజ్‌3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని హైకోర్టును కోరారు. సెక్షన్‌-15 క్లాజ్‌ 6 ప్రకారం సమాచార కమిషనర్‌గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని పిటిషనర్ తెలిపారు. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి విశిష్టమైన పదవులను ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం మంచి సంప్రదాయం కానే కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: