ఏపీలో హోరాహోరీగా జ‌రిగిన ఎన్నిక‌ల‌ ఫ‌లితాల వెల్ల‌డికి దాదాపు మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉండ‌గా...ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే అంతా ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, పార్టీల నేత‌లు ప్ర‌జ‌లు అనుకుంటున్న త‌రుణంలో, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కడప జిల్లా పులివెందులలో పర్యటన సందర్భంగా పులివెందులలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ప్రజానీకంతో కిక్కిరిసి పోయింది. వైఎస్‌ జగన్ నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బారుకు పెద్ద ఎత్తున స్పంద‌న వ‌చ్చింది.


ప్ర‌జా ద‌ర్బార్‌ సందర్భంగా జగన్‌ తన దగ్గరికి వచ్చిన వారిని అందరిని సాదరంగా పలకరిస్తూ వారు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్‌కు వ్యక్తిగత, సామూహిక సమస్యలను ప్రజలు వినతి పత్రాల రూపంలో, అలాగే మౌఖికంగా వివరించారు. ఇందులో ఎక్కువగా మహిళలు, నిరుద్యోగ యువతీ, యువకులు, రైతులు ఉన్నారు. ముఖ్యంగా జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జగన్‌ వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికా రంలోకి రానున్నదని, మన ప్రభుత్వంలో అందరి ఆశీర్వాదంతో అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తా నని, అందరికీ భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు.


ఈ సంద ర్భంగా వైఎస్‌ జగన్‌ తన దగ్గరకు వచ్చి తెలి పిన సమస్యలను కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఓఎస్‌డి కృష్ణమోహన్‌ రెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌లకు సూచన లిస్తూ వాటిని ఆయా శాఖల అధికారులతో, సిబ్బందితో మాట్లాడి పరిష్కరింపజేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రైతులు తమకు రావాల్సిన పంటల బీమా, పంట నష్టపరిహారం ఈసారి కరువుతో ఇబ్బందులు ఎదుర్కొన్న వైనాన్ని జగన్‌కు విన్నవించారు. రైతుల ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని తప్పనిసరిగా న్యాయం చేస్తా మని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. అలాగే మహిళలు వ్యక్తిగత, సామూహిక సమస్య లను జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భం గా జగన్‌ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా వైకాపా ప్రభుత్వం రాగానే ప్రయోజనం కలిగించే సౌకర్యాలను అంది స్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతీ, యువకులకు విద్యార్హత, ప్రతిభలను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో ఎంత వీలైతే అంతమేరకు తప్పని సరిగా ఉపాధి సౌక ర్యాలను కల్పించేందుకు కృషిచేస్తామని వారికి హామీ ఇచ్చారు. 


కాగా, జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్ నేప‌థ్యంలో క‌డ‌ప‌లోని కొంద‌రు ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిపోయిన త‌ర్వాత తిరిగి క‌డ‌ప‌కు రావ‌డం త‌గ్గిపోతుందని, అందుకే ముందుగా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నార‌ని పేర్కొంటూనే...ఈ నిర్ణ‌యం మంచిచేదే అయిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో త‌మ స‌మ‌స్య‌లు ఎలా నివేదించుకోవాల‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, ఇలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని వైసీపీ నేత‌లు త‌గు ప‌రిష్కారం చూపుతారని ఇంకొంద‌రు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: