ఈసారి జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పాలని మొదటి నుంచి టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఆయన ఏడాది ముందే బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటపడ్డారు. యాంటీ మోడీ స్టాండ్ తీసుకుని అందరికంటే తానే మొనగాడు అనిపించుకుంతే ప్రయత్నం చేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబు ఓ విషయం మరచిపోయారు. అదే ఇపుడు కొంప ముంచుతుందా అన్న డౌట్లు తమ్ముళ్ళకు వస్తున్నాయట.


ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇదీ రూల్. కానీ బాబు గారు గత ఏడాదంతా ఏపీలో మళ్ళీ మేమే అనుకుంటూ దేశాలు పట్టారు. పైగా పార్టీని గాలికి వదిలేశారు. మరో వైపు  తన్నుకుంటూ ముందుకు వచ్చిన ఎన్నికల్లో బాగానే తడబడ్డారు. ఎంతో వ్యతిరేకత మూటకట్టుకున్న సిట్టింగులకు టికెట్లు కట్టబెట్టారు. అప్పటికే జనంలో ఏడాదిన్నరగా పాదయాత్ర చేస్తూ వేవ్ క్రియేట్ చేసుకున్న జగన్ దూసుకుపోయారు. పాదయాత్ర వేడి అలా ఉండగానే వచ్చిపడిన ఎన్నికలు జగన్ కి మంచి లాభం అంటున్నారు.


ఇక ఏపీలో జగన్ ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తారని, ఆయన పార్టీకి కనీసం 15 నుంచి 20 మధ్యలో ఎంపీ సీట్లు కూడా  దక్కుతాయని జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ  నేపధ్యంలో  ఎగ్టిట్ పోల్స్ ఈ నెల 19న రానున్నాయి. ఆ తరువాత జగన్ ఇంటి ముందు డిల్లీ పార్టీలన్నీ క్యూ కడతాయని అంటున్నరు. అంటే అసలు ప్రజా తీర్పు కంటే నాలుగు రోజుల ముందే జగన్ నివాశం సందడి చేయనుందన్నమాట.


జగన్ సైతం ఇపుడున్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు పక్కా ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఏ మాత్రం తొందరపడకుండా ఏ కూటమితో పొత్తు కట్టకుండా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. రేపటి రోజున తనకు ఏపీకి  ఏది లాభం అనిపిస్తే ఆ ఆప్షన్ని మాత్రమే జగన్ ఎంచుకుంటారని, ద్వారా జగన్ కీలకమైన జాతీయ నేతగా ఈసారి ఎదుగుతారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: