తెలుగులో నెంబర్ వన్ ఛానల్ టీవీ నైన్ నుంచి బలవంతంగా నిష్క్రమించిన రవిప్రకాశ్ మరో కొత్త ఛానల్‌ తో సంచలనం సృష్టించబోతున్నారా.. ఆయన త్వరలోనే ఓ కొత్త ఛానల్ ప్రారంభించచబోతున్నారా.. అవుననే తెలుస్తోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చూచాయగా తెలిపారు. 


ఓ సాధారణ జర్నలిస్టునైన తాను.. టీవీ నైన్ ఛానల్‌ ను అసాధ్యమనదగ్గ రీతిలో తీర్చిదిద్దానని చెప్పుకున్నారు. తాను ఇప్పటికీ టీవీ9 చానల్ లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నానారు రవిప్రకాశ్. అయితే యాజమాన్యం మారిన వేళ.. తనకు షో నిర్వహించే వీలు లేకపోవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

తనకు టీవీ9 లో స్థానం లేకపోతే.. మరో చానల్ ప్రారంభించి, మొదటి నుంచి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. రవిప్రకాశ్‌ కు ఇప్పటికే మోజో టీవీని ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని వెబ్ సైట్లు కూడా రవిప్రకాశ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడికి చెందిన ఐ న్యూస్ ను రవిప్రకాశ్ టేకోవర్ చేస్తారని కూడా అంటున్నారు. మరి వీటిలో ఏదో ఒకదాన్ని రవిప్రకాశ్ అభివృద్ధి చేస్తారా.. లేక కొత్తగా మరో చానల్ పెడతారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆయన ఏం చేయాలన్నా ముందు ఫోర్జరీ కేసులో బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: