Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 1:51 am IST

Menu &Sections

Search

అందరిలోనూ అదే ఉత్కంఠ

అందరిలోనూ అదే ఉత్కంఠ
అందరిలోనూ అదే ఉత్కంఠ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏప్రిల్ 11 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి.  మరో 9 రోజుల్లో రిజల్ట్ రాబోతున్నది.  రిజల్ట్ సమయం దగ్గర పడేకొద్దిఅందరిలోనూ ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఫలితాలు ఎవరికి అనుకూలంగా రాబోతున్నాయి... ఎవరు గెలుస్తారు... ఎంత రికార్డ్మెజారిటీ వస్తుంది అనే దానిపై ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు.  

ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ బయటకు రావాలన్నా... మే 19 వరకు ఆగాలి.  చివరి ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు  ఈ రిజల్ట్ బయటపెట్టకూడదుఅందుకే.. అందరిలోనూ ఆ ఉత్కంఠత కలిగింది.  గెలుపు తమదే అని, ఎన్నికల్లో టిడిపి 130 సీట్లు గెలుచుకొని అధికారాన్ని మరోసారిహస్తగతం చేసుకుంటామని టీడీపీ నేతలు చెప్తున్నారు. 

ఇలా లెక్కలు వేసుకుంటూనే.. ఒకవేళ అనుకున్న మెజారిటీ రాకుంటే.. ఏం చేయాలి అనే దానిపై పార్టీలో అంతర్గతంగా మంతనాలుజరుపుతున్నారు.  అటు వైకాపా కూడా ఇదే విధమైన లెక్కలు వేసుకుంటోంది.  ముందుస్తు ఫలితాలు వైకాపాకే అనుకూలంగా ఉన్నాయనిసమాచారం అందుతుండటంతో ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.  ఎవరు క్యాబినెట్ లో ఉండాలి... ఎలాంటి పదవులు ఇవ్వాలి అనే దానిగురించి పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.  


అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న నియోజక వర్గం మంగళగిరి.  ఇక్కడి నుంచి టిడిపి నేత, మంత్రి లోకేష్ పోటీలో ఉండటం విశేషం. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ నియోజక వర్గం ఆ తరువాత కాంగ్రెస్, టిడిపి,  2014 లో వైకాపా విజయం సాధించింది.1952ఈ నియోజక వర్గం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ 6 సార్లు విజయం సాధిస్తే, టిడిపి రెండు సార్లు, వైకాపా ఒకసారి విజయం సాధించింది.2014 లోవైకాపా అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి విజయం సాధించాడు.  ఆళ్ళకు నియోజక వర్గంలో మంచి పేరు ఉంది.  బలమైన అభ్యర్థి కావడంతోలోకేష్ ఎలా ఎదుర్కొంటాడు అన్నది తెలియాలి.


apelections
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING