Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:33 am IST

Menu &Sections

Search

టోటల్ క్లియర్: రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది

టోటల్ క్లియర్: రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
టోటల్ క్లియర్: రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టివి-9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను మోసం చేయటానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్రచేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు. టీవీ9 మాతృసంస్థ ‘అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్' కొత్త యాజమాన్యానికి ఇబ్బందు లు సృష్టించే ఉద్దేశంతో ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్'  ని అడ్డుపెట్టుకుని పావులు కదిపారని తేటతెల్లమయ్యింది. 
doubted-culprits-are-caught-in-tv9-case
రవిప్రకాశ్‌, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసువేయడం కోసం కుట్రచేసి, పాత తేదీతో నకిలీ షేర్లు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న ట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించినట్లు తెలిసింది. ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌సీఎల్‌టీలో సమర్పించడానికి వీలుగా రవిప్రకాష్ మరోనలుగురితో కలిసి నకిలీ ఒప్పందపత్రాన్ని తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఒక వార్తాకథనాన్ని ప్రసారం చేయడం సంచలనం సృష్టిస్తోంది. సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రకటించుకుంది.
doubted-culprits-are-caught-in-tv9-case
కుట్రకు సంబంధించిన పలువురు వక్తుల మధ్య బదిలీ అయిన పలు ఈ మెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసు స్వాధీనం చేసు కున్నారు. ఆధారాలు దొరకకుండా సర్వర్‌ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీశారు. 
doubted-culprits-are-caught-in-tv9-case
రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018 న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌, వాస్తవానికి ఏప్రిల్‌ 13, 2019న తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్‌ ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తికి రవిప్రకాశ్‌ సన్నిహితుడు, న్యాయవాది శక్తి మెయిల్‌ చేశారు. 
doubted-culprits-are-caught-in-tv9-case
ఈ-మెయిల్‌ను  రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపించారు. ఫిబ్రవరి 20, 2018 న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:39 గంటల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. 
doubted-culprits-are-caught-in-tv9-case
రవిప్రకాష్, డైరెక్టర్ మూర్తి, హరి, శక్తి, విజయవాడకు చెందిన ఒక న్యాయవాది మధ్య అందుకు సంబంధించిన ఈ-మెయిల్ సంభాషణలను పోలీసులు గుర్తించారు. సంభాషణల అనంతరం ఈ-మెయిల్స్ ను డీలిట్ చేశారు. ఇక శివాజీ ఎన్‌సీఎల్‌టీ లో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన అడ్వకేట్ రూపొందించారు. 
doubted-culprits-are-caught-in-tv9-case
ఆ మరుసటి రోజున అంటే, ఏప్రిల్‌ 14, 2019న ఉదయం 5:38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పుల ను ఈ మెయిల్‌లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటల కల్లా, విజయవాడ అడ్వకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ, శక్తి - రవిప్రకాశ్‌, ఆయన అనుచరులకు ఈ-మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్‌ లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు. 
doubted-culprits-are-caught-in-tv9-case
ఈ సెక్షన్ కింద అరెస్టయ్యే ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకోవడం కోసం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో, ఎన్‌సీఎల్‌టీ లో జరగబోయే విచారణమీదే ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు రవిప్రకాశ్‌ సన్నిహితుడు, న్యాయవాది, శక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
doubted-culprits-are-caught-in-tv9-case
పోలీసులు జారీ చేసిన నోటీసులకు రవిప్రకాష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అతను ఎప్పటికప్పుడు సెల్-ఫోన్లు మారుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం ఆయన రెండు సెల్-ఫోన్లను వాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.

doubted-culprits-are-caught-in-tv9-case

doubted-culprits-are-caught-in-tv9-case
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
About the author