ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వ‌చ్చే గురువారం విడుద‌ల కానున్నాయి. ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల క‌న్నా ఏపీలో ఈ సారి జ‌రిగిన ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగాయి. ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా గెలుపు వైసీపీదే అని చాలా స‌ర్వేల‌తో పాటు మీడియా మేథావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. ఇక టీడీపీ గెలుస్తుంద‌ని కూడా చెప్పేవాళ్లు ఉన్నా వాళ్ల శాతం చాలా త‌క్కువ మాత్ర‌మే క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే చాలా చోట్ల సోష‌ల్ మీడియాలో వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనే నేను అంటూ వైసీపీ అభిమానులు కామెంట్ల‌ను బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ గెలిస్తే ఆయ‌న కేబినెట్‌లో ఎవ‌రెవ‌రు మంత్రులుగా ఉంటారు ? అన్న‌ది కూడా స‌హ‌జంగానే ఆస‌క్తి రేపుతోంది. జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టికే ముగ్గురికి ఓపెన్‌గానే మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని చెప్పారు. వీరిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, చిల‌కలూరిపేట‌లో సీటు త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేర్ల‌ను ప్ర‌క‌టించారు. 

ఇక జ‌గ‌న్ సీఎం అయితే ఆయ‌న కేబినెట్లో ఎవ‌రెవ‌రు ఉంటార‌న్న అంశంపై పేర్ల‌తో కూడిన ఓ జాబితా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ లిస్టును వైసీపీ వ‌ర్గాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌లో హల్‌చ‌ల్ చేయిస్తున్నారు. ఈ జాబితాపై మీరు కూడా ఓ లుక్కేయండి

జగన్ కేబినెట్‌లోని మంత్రుల జాబితా:

1) ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (పులివెందుల‌)
2) స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు (ప‌ర్చూరు)
3) డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి (కురుపాం)
4) హోం మంత్రి : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (పుంగ‌నూరు)
5) రెవిన్యూ శాఖ : ధర్మాన ప్రసాద రావు (శ్రీకాకుళం)
6) ఐటీ శాఖ : మోపిదేవి వెంకటరమణ (రేప‌ల్లె)
7) పంచాయతీ రాజ్ శాఖ : ఆనం రాంనారాయణ రెడ్డి (వెంక‌ట‌గిరి)
8) విద్యుత్ శాఖ : రోజా (న‌గ‌రి)
9) ఫైనాన్స్ శాఖ : బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (డోన్‌)
10) భారీ నీటి పారుదల శాఖ : కొడాలి నాని (గుడివాడ‌)
11) రోడ్లు & భవనాల శాఖ : బొత్స సత్యనారాయణ (చీపురుప‌ల్లి)
12) మున్సిపల్ శాఖ : గడికోట శ్రీకాంత్ రెడ్డి (రాయ‌చోటి)
13) పౌర సరఫరాల శాఖ : పిల్లి సుభాష్ చంద్రబోస్ (మండ‌పేట‌)
14) స్త్రీ శిశు సంక్షేమ శాఖ : తానేటి వనిత (కొవ్వూరు)
15) వైద్యఆరోగ్య శాఖ : అవంతి శ్రీనివాస్ (భీమిలి)
16) బీసీ సంక్షేమ శాఖ : తమ్మినేని సీతారాం (ఆముదాల‌వ‌ల‌స‌)
17) విద్యా శాఖ : కురసాల కన్నబాబు (కాకినాడ రూర‌ల్‌)
18) అటవీ శాఖ : శిల్ప చక్రపాణి రెడ్డిరెడ్డి (శ్రీశైలం)
19) దేవాదాయ శాఖ : కోన రఘుపతి (బాప‌ట్ల‌)
20) న్యాయ శాఖ : వై. విశ్వేశర రెడ్డి (ఉర‌వ‌కొండ‌)
21) మైనింగ్ శాఖ : బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఒంగోలు)
22) సాంఘిక సంక్షేమ శాఖ : భాగ్యలక్ష్మి (పాడేరు)
23) వ్యవసాయ శాఖ : ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ( మంగ‌ళ‌గిరి)
24) సినిమాటోగ్రఫీ శాఖ : గ్రంధి శ్రీనివాస్ (భీమ‌వ‌రం)
25) కార్మిక, రవాణా శాఖ : ఆళ్ళ నాని (ఏలూరు)
26) మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ : అమంచి కృష్ణ మోహన్ (చీరాల‌)
27) పరిశ్రమల శాఖ : కాకాని గోవర్ధన్ రెడ్డి (స‌ర్వేప‌ల్లి)
28) టూరిజం, తెలుగు సంస్కృతి శాఖ : కె. ఇక్బాల్ అహ్మద్ (హిందూపురం)
29) గృహ నిర్మాణ శాఖ : కొక్కిలిగడ్డ రక్షణనిధి (తిరువూరు)

అయితే జగన్ ప్రచారంలోనే మంత్రి పదవి దక్కే కొందరి పేర్లను ప్రకటించారు. ఈ లిస్టులో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో సీటు త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. మ‌రి వీరి సంగ‌తేంట‌న్న‌ది ఈ లిస్టులో చెప్ప‌లేదు. ఏదేమైనా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ లిస్టు చూస్తుంటే జ‌గ‌న్ కేబినెట్‌లో సీనియ‌ర్ల‌కు పెద్ద‌పీఠ వేశారు. అలాగే మ‌హిళ‌ల‌కు కూడా చోటు ఉంది. ఫైన‌ల్ లిస్టు ఇలా ఉండ‌కపోయినా కొన్ని మార్పులు ఉన్నా ఈ లిస్టులో చాలా మందికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: