మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు పై తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్రాజెక్టును ఆపే ప్ర‌సక్తు లేద‌ని స్ప‌ష్టం చేసింది. గురువారం నిర్వాసితులు వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జరిగింది. దీంతో ప‌రిహారం తీసుకోవాల‌ని నిర్వాసితుల‌కు న్యాయస్థానం సూచించింది. 


ఒక‌వేళ ప‌రిహారం విష‌యంలో ఏమైనా అన్యాయం జ‌రిగితే త‌మ వ‌ద్ద‌కు రావ‌చ్చని కోర్టు తెలిపింది. ఈ మేరకు పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరఫు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది.


ఈ నేప‌థ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్ల కూడా క‌లిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం స్పష్టంచేసింది. 


కాగా.. కాళేశ్వ‌రం దానికి అనుకొని ఉన్న ప్రాజెక్టుల‌కు సంబంధించి హైకోర్టు ఇప్ప‌టికే పెండింగ్‌లో ఉన్న 175కు పైగా పిటిష‌న్లు క‌లిపి విచారించాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం హైకోర్టులో మ‌ధ్యంత‌ర ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకున్న విష‌యం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: