డిల్లీలో చక్రం తిప్పడం మాట దేముడెరుగు. ఏపీలో బాబు చక్రం వూడిపోతోంది. ఆయన్ని జనం దించేయడానికి డిసైడ్ అయిపోయారు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే మురళీధరరావు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ పర్యటన  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబుకు మే 23 తరువాత గడ్డురోజులేనని తేల్చేశారు. ఏపీలో బాబుకు ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిందని ఆయన అంచనా వేశారు.


జాతీయ సర్వేలు  సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పుకొచ్చారు. ఏపీలో కనీసం అయిందు ఎంపీ సీట్లు బాబు పార్టీకి రావడం కష్టమని కూడా ఆయన అన్నారు.  అటువంటి టీడీపీ అధినేత డిల్లీలో మోడీకి వ్యతిరేకంగా చక్రం తిప్పుతాను అనడం పెద్ద జోక్ అనేశారు. ఏపీలో బాబు ఎన్ని రకాలా విన్యాసాలు చేసినా ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకమేనని మురళీధరరావు అన్నారు.


బాబు ప్రజా వ్యతిరేకతను పూర్తిగా సొమ్ము చేసుకున్నది వైసీపీ మాత్రమేనని ఆయన అన్నారు. జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారని, ఆయన పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఏపీలో బీజేపీ రానున్న రోజుల్లో బాగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక దేశంలో మోడీ మళ్ళీ ప్రధాని అవుతున్నారని జోస్యం చెప్పారు. గతం కంటే ఎక్కువ సీట్లు తమ పార్టీకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: