ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో వారం రోజుల్లో వ‌చ్చేస్తున్నాయ్‌. వ‌చ్చే గురువారం మ‌ధ్యాహ్నానికే ఏపీకి కాబోయే కొత్త సీఎం ఎవ‌రు ? అన్న‌దానిపై ట్రెండ్స్ చాలా వ‌ర‌కు క్లారిటీ ఇచ్చేస్తాయి. ఇక చాలా వ‌ర‌కు పోలింగ్ ముగిశాక వెలువ‌డిన అంచ‌నాల ప్ర‌కారం వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీకి కాబోయే కొత్త సీఎం అన్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడి వైసీపీని స్థాపించిన‌ప్పటి నుంచి జ‌గ‌న్‌ను ఏడెనిమిది సంవ‌త్స‌రాలుగా కొంద‌రు కంటిన్యూగా టార్గెట్‌గా చేసుకున్నారు. 

ఇటు టీడీపీ వాళ్లు అంటే స‌హ‌జంగా రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు  అంటే ఓ అర్థం ఉంది. కానీ మీడియా ముసుగులో ప‌చ్చ తొడుగు వేసుకున్న కొన్ని ప‌త్రిక‌లు, న్యూస్ ఛానెల్స్ మాత్రం జ‌గ‌న్‌పై ప‌దేళ్లుగా లేనిపోని రాత‌లు రాస్తూనే ఉన్నాయ్‌. 2009 నుంచి ప్రారంభ‌మైన ఈ విష‌పు క‌థ‌నాల ప‌రంప‌ర ఈ ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగింది. ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే ఈ ప‌చ్చ ప‌త్రిక‌లు, ప‌చ్చ ఛానెళ్ల‌ను టార్గెట్‌గా చేసుకోవ‌డంలో త‌ప్పేం ఉంద‌న్న వాద‌న‌లు వైసీపీ నుంచే ఉన్నాయ్‌.

అయితే జ‌గ‌న్ వీళ్ల‌ను కావాల‌ని ఏ మాత్రం టార్గెట్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డు. అంతెందుకు తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌చ్చినందుకు అక్క‌డ ఏబీఎన్‌, టీవీ-9 ఛానెల్స్‌ను ఎన్ని రోజులు మూసివేశారో చూశాం. టీవీ-9 త‌ప్పు ఒప్పుకోవ‌డంతో త్వ‌ర‌గానే బ‌తికి బ‌య‌ట‌ప‌డింది. ఇక ఏబీఎన్ ఛానెల్ ఏకంగా నెల‌ల పాటు యుద్ధాలు చేసి చివ‌ర‌కు సైలెంట్ అవ్వ‌క త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు రాధాకృష్ణ రాజీకీ రాక త‌ప్ప‌లేద‌న్న టాక్ మీడియా వ‌ర్గాల్లో వినిపించింది.

ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయితే ఈనాడు క‌న్నా ఆంధ్ర‌జ్యోతే వైసీపీ వాళ్ల‌కు ప్ర‌ధానంగా టార్గెట్ కానుంది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నాడ‌ని రాధాకృష్ణ ఐదేళ్ల‌పాటు పిచ్చి రాత‌లు రాయ‌డంతో పాటు పిచ్చి కూత‌లు కూశాడ‌ని... ఇప్పుడు రాధాకృష్ణ అంతు ముందుగా చూడాల్సిందే అని వైసీపీ వాళ్లు ప‌గ‌తో ఉన్నారు. ఇక జ‌గ‌న్ సైతం త‌న ప్ర‌చారంలో ఆ రెండు ప‌త్రిక‌ల‌తో పాటు టీవీ-5పై కూడా యుద్ధం చేయాల‌ని చెప్పారు.

ఇక ఎన్నిక‌ల క‌వ‌రేజ్‌లో ఈనాడు మ‌రి వైసీపీపై తీవ్ర‌యైన యుద్ధం చేసే రేంజులో కాకుండా కొన్ని సార్లు అయినా న్యూట్ర‌ల్ ప‌ద్ధ‌తి పాటించిన‌ట్లు ఉంది. జ్యోతి, టీవీ-5 ప‌దే ప‌దే జ‌గ‌న్‌, వైసీపీని టార్గెట్‌గా చేసుకుని ప‌స‌లేని క‌థ‌నాలు వండేశాయి. జ్యోతి చాలాసార్లు దొంగ స‌ర్వేల పేరిట హ‌డావిడి చేసి ప‌రువు పోగొట్టుకుంది. ఇక ఈనాడు కొన్ని సార్లు న్యూట్ర‌ల్‌గా, కొన్ని సార్లు వైసీపీకీ యాంటీగా వెళ్లింది.

తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి వారం రోజుల ముందు సాక్షి మీడియాలో టీవీ-9 ర‌విప్ర‌కాష్ విష‌యంలో వ‌చ్చిన క‌థ‌నాన్ని బ‌ట్టి చూస్తే జ‌గ‌న్ రామోజీని కూడా ఢీకొట్టేందుకు రెడీగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.  ఏదేమైనా ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న మీడియాగా యుద్ధం చేసిన జ‌గ‌న్ మీడియా ఇప్పుడు అధికార‌ప‌క్షంలో ఉండి మ‌రో కొత్త యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే టైంలో జ‌గ‌న్ ఈ మీడియా సంస్థ‌ల విష‌యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో ?  కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: