తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌వ‌చిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్ఆన‌ల‌పై ఆయా పార్టీల నేత‌లు త‌మ‌దైన వైలిలో స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనల వల్ల బెంగాల్ సంస్కృతికే అవమానం అని అన్నారు.


పశ్చిమ బెంగాల్ లో రెండు పార్టీలు ప్రజలతో చెలగాటం అడుతున్నాయని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. బెంగాల్‌ హింసకు బీజేపీ, తృణమూల్‌ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఒక రోజు ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేయడం సరికాదని సుర‌వ‌రం పేర్కొన్నారు.

``బీజేపీ ఎన్నికల ప్రచారం ముగిసిందనే ప్రచారాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది. మతం పేరును ఉపయోగించిన మోడీ, అమిత్‌ షాలపై చర్యలు తీసుకునే ధైర్యం చేయలేకపోయింది' అని సురవరం అభిప్రాయపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: