చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య దాడులు, ప్రతిదాడుల పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా రామచంద్ర పురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లి గ్రామంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. 


ఓటమి భయంతోనే  చెవిరెడ్డి రీ పోలింగ్ పెట్టించారంటూ కమ్మపల్లి గ్రామంలోకి మోహిత్ రెడ్డిని రానీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. చీపుర్లు, చేటలు పట్టుకుని చెవిరెడ్డి కుమారునిపై మహిళలు దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

కమ్మపల్లి గ్రామస్తుల తీరుతో మోహిత్ రెడ్డి ఆగ్రహం చెందాడు.. గ్రామం ముందు వైసీపీ నాయకులతో కలసి బైఠాయించారు. ఈ విషయం తెలుసుకుని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కూడా అక్కడికి చేరుకున్నారు. 

టీడీపీ- వైసీపీ నేతల ఘర్షణ విషయం తెలిసిన పోలీసులు కూడా భారీ స్థాయిలో చేరుకున్నారు. ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ రీపోలింగ్ కు ఫిర్యాదు చేసిన ఐదు బూత్‌లు కూడా టీడీపీ ప్రాబల్యం ఉన్నవేనన్నది ఆ పార్టీ ఆరోపణ. 



మరింత సమాచారం తెలుసుకోండి: