టీవీ నైన్ మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నా ఆయన్ను కాపాడే ప్రయత్నాలు చకచకా జరిగిపోతున్నాయట. రవిప్రకాశ్ కొత్తగా ఇప్పుడు ముఖేశ్ అంబానీ గూటికి చేరుకుంటున్నాడట. ఆయన ఆధ్వర్యంలో ఉన్న న్యూస్ 18 గ్రూపులోకి రవిప్రకాశ్ చేరబోతున్నాడట. 


ఆ న్యూస్ 18 గ్రూపులోకే తన మోజీ టీవీని కూడా తీసుకెళ్లబోతున్నాడట. ఇవీ రవిప్రకాశ్ కు సంబంధించిన తాజా కబుర్లు.. ఫోర్జరీ కేసు ఆరోపణల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన రవిప్రకాశ్ ముంబయిలో ముఖేష్ అంబానీని కలిసినట్టు తెలుస్తోంది. రిలయన్స్ కి చెందిన నెట్ వర్క్ 18  లో సౌత్ ఇండియా హెడ్ గా బాధ్యలు చేపట్టబోతున్నారట .

రిలయన్స్ కు చెందిన  నెట్ వర్క్ 18  దేశంలోని అన్ని భాషల్లో న్యూస్ 18 పేరుతో న్యూస్ చానెల్స్ ప్రారంభించింది . చాలా భాషల్లో ఆ చానెళ్లు మంచి పొజిషన్ లో ఉన్నాయి . ఈటీవీ నెట్వర్క్ కు చెందిన ఇతర బాషా చానెళ్లని కూడా  రిలయన్స్ కొనుగోలు చేసి న్యూస్ 18 కింద మార్చేసింది. 

ఇప్పుడు తెలుగులో న్యూస్ 18 ఆన్ లైన్ పోర్టల్ నడుపుతోంది . తెలుగులొ పూర్తి స్థాయిలో చానెల్స్ ప్రారంభించబోతోందట. రవిప్రకాశ్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబే రవిప్రకాశ్ ను ఆదుకునేందుకు ముఖేశ్‌ తో మధ్యవర్తిత్వం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: