యూట్యూబ్ వచ్చేశాక.. ఎవరికి వారే తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది. గతంలో సెలబ్రెటీలు తమ అభిప్రాయాలు ప్రజలకు చెప్పాలంటే మీడియాను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. మీడియా విన్నదంతా విని తమకు తోచింది పేపర్లో రాసేవారు. 


ఇప్పుడు సెలబ్రెటీలకు ఆ బాధ లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని వారేం చెప్పదలచుకున్నారో అదే విషయం నేరుగా చెప్పేస్తున్నారు. అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటున్న వారిలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన తన అభిప్రాయాలను నా ఆలోచన పేరుతో అందిస్తున్నారు. 

తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఏపీలో ఎన్నికల బెట్టింగ్ పై విరుచుకుపడ్డారు. అది చాలామంది జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అంతవరకూ ఓకే.. పవన్ కల్యాణ్ నాన్ సీరియస్ గా వచ్చి.. అధికారపక్షం వైపు మొగ్గడాన్ని ఆయన కడిగిపారేశారు. 

దమ్ముంటే.. అటు టీడీపీ, వైసీపీలను రెండింటినీ విమర్శించాలని.. కానీ పవన్ కేవలం జగన్ ను మాత్రమే తిడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే అది కేవలం పవన్ కల్యాణ్ నాయకత్వ వైఫల్యమే అవుతుందని తీవ్రంగా కామెంట్ చేశారు. అంతా బాగానే ఉన్నా.. ఈ వీడియోకు థంబ్ నెయిల్ - పవన్ కల్యాణ్ వస్తే పగులుద్ధి అని ఇవ్వడం మాత్రం వ్యూస్ కోసమే పెట్టినట్టుగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: