పచ్చ పత్రికలు టీడీపీ అనుకూలంగా .. వైసీపీ వ్యతిరేకంగా జనాలకు నిజాలు తెలియకుండా చేయడానికి ఎంతకైనా దిగజారుతున్నాయి. వైకాపా అధికారంలోకి వస్తే 55వేల కోట్లు కొత్తగా అవసరం పడతాయి అంటూ కథనాలు వండి వారుస్తోంది తెలుగుదేశం అనుకూల దినపత్రిక. బాబు వస్తే మాత్రం వున్న పథకాలే కనుక అదనపు భారంలేదు అంటోంది. కానీ వాస్తవాలు చాలా వేరుగా వున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చినా, బాబుగారు అధికారంలోకి వచ్చినా ఖజానా మీద సంక్షేమపథకాల భారం ఎక్కువే వుంటుందన్నది వాస్తవం.


అదికాక ఉద్యోగుల జీతాల పెంపులాంటి వ్యవహారాలను బాబు తెలివిగా ఎన్నికల అవతలకి తోస్తూ జీవోలు ఇచ్చారు. ఎవరు వచ్చినా ఇప్పుడు అర్జెంట్ గా ఇంటీరియమ్ రిలీఫ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. ఇది కొన్ని వేలకోట్ల భారం. బాబుగారు ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలు ఏవీ తక్కువకాదు. ఫింఛన్లు అయితేనేం, నిరుద్యోగ భృతి అయితేనేం, కానుకలు, చదివింపులు అయితేనేం, అన్నీ యధాశక్తి పెంచుతా అని వాగ్దానాలు చేసారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే.


ఈ సంగతి ఇలా వుంచితే జగన్ వస్తే తగ్గేవి కూడా వున్నాయి. బాబుగారి హయాంలో ఎడాపెడా అంచనాలు పెంచేసిన వ్యవహారాలు, పెంచబోయి ఆగిన వ్యవహారాలు వున్నాయి. ఇప్పుడు అన్నీ బయటకు వస్తాయి. అసలు ఫిగర్లు తేలతాయి. ఆ విధంగా పొదుపు కావడానికి కూడా అవకాశం వుంది. నిజానికి మీడియా ఖర్చులు, ఖజానా భారాల గురించి రాయదలుచుకుంటే, ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం వరాలు ఏమిటి? ఇష్టం వచ్చినట్లు నగదు పంపిణీలు ఏమిటి? దానివల్ల రాష్ట్రం చెల్లించాల్సిన  మూల్యం ఏమిటి? అప్పులు ఏ మేరకు పెరిగాయి. అప్పు పుట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ వివరించి వుండాల్సింది. ఓటర్లను ఫ్రభావితం చేసే ప్రయత్నం చేయాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: