ఏపీలో ఇపుడు అసలు ఫలితాల కంటే కొసరు ఫలితాల మీద అందరికీ ఇంటెరెస్ట్ పెరిగిపోతోంది. అసలు ఫలితాలు రావడానికి ఆరు రోజుల సమయం ఉంది. అదే అగ్టిట్ పోల్స్ రావడానికి రెండు రోజులే. అందుకే ఈ సండేను ఇలా గడిపేయాలనుకుంటున్నారు. జనాలకు ఎలా ఉన్నా రాజకీయ పార్టీలకు మాత్రం ఎగ్టిట్ పోల్స్ తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి.


ఎగ్టిట్ పోల్స్ గురిచి ముందు కంగారు పడింది చంద్రబాబు. ఆయన ఇటీవల మంత్రులతో చిట్ చాట్ చేస్తూ ఎగ్టిట్ పోల్స్ ఎవరూ నమ్మవద్దంటూ చెప్పేశారు. పైగా మరో మాట కూడా వాడారట. ఈ ఎగ్టిట్ పోల్స్ కాదు మనకు కావాల్సింది. అసలు పోల్స్ మనవైపే ఉన్నాయని కూడా బాబు అన్నట్లు భోగట్టా. మరి అదే నిజమైతే ఎగ్టిట్ పోల్స్ గురించి అంత కంగారెందుకో బాబు గారే చెప్పాలి.


అయీతే ఎగ్టిట్ పోల్స్ ఇప్పటికే బాబు వద్దకు చేరాయని అంటున్నారు. అందులో విషయం చూసే చంద్రబాబు ఇపుడు కంగారు పడుతున్నారని, అవే నిజం అవుతాయా అన్న డౌట్లు కూడా ఆయనకు వున్నాయని అంటున్నారు. ఐతే ఎగ్టిట్ పోల్స్ మాత్రం ఎవరు అవునన్నా కాదన్న కొంత వాస్తవిక పరిస్థితికి అద్దం పడతాయి. ఓ రకమైన ట్రెండ్ కూడా తెలుస్తుంది. ఎగ్టిట్ పోల్స్ లో వైసెపీ గెలిస్తే ఇక 23 ఫలితాలల్లోనూ దాదాపుగా ఆ పార్టీయే గెలవవచ్చు. మరి ఈ సంగతి తెలిసేనా చంద్రబాబు కంగారు పడుతోంది. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: