ఎన్నికల పోలింగ్ ముగిసి నెలరోజులు దాటింది. ఇక మే 23 దగ్గరకు వచ్చేస్తోంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో వైసీపీ శ్రేణులు ధీమాగా ఉంటే.. టీడీపీ శ్రేణుల్లో మాత్రం అప్పుడే వణుకు మొదలైంది. 


ఏకంగా పార్టీ అధ్యక్షుడే ఎగ్జిట్ పోల్స్ మనకు అనుకూలంగా రాకపోవచ్చు.. వాటిని చూసి కంగారు పడొద్దు అని సిగ్నల్ ఇవ్వడం వారి గాభరాను మరికాస్త పెంచుతోంది. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ తో ఓటింగ్ ట్రెండ్ తెలిసిపోతుంటుంది. 

ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికల రోజు ఓటేసి వచ్చిన వారిని అడిగి చెప్పే సర్వేలు.. ఇవి చాలా వరకూ కచ్చితంగానే ఉంటాయి. కానీ గతంలో ఎగ్జిట్స్ పోల్స్ కూడా అంచనాలు తప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ అన్ని ఛానళ్లూ ఒకేలా చెప్పిన తర్వాత అవి మారే ఛాన్స్ దాదాపుగా ఉండదు. 

ఒక్కో ఛానల్ ఒక్కోలా చెబితే మాత్రం అప్పుడు ఫలితాలపై ఉత్కంఠ తప్పకపోవచ్చు. ఎన్నికల ముందు జరిపిన సర్వేలు మాత్రం దాదాపు అన్నీ వైసీపీదే అధికారం అని చెప్పేశాయి. కానీ చివర్లో ప్రయోగించిన పసుపు కుంకుమ, ఫించన్ డబుల్ అస్త్రాలు ఏమేరకు పని చేశాయో ఫలితాలు వస్తే కానీ తెలియవు. ఏదేమైనా టీడీపీ నేతల గుండెళ్లో మాత్రం ఎగ్జిట్ ఫలితాలు రైళ్లు పరిగెత్తించే అవకాశాలే ఎక్కువ.



మరింత సమాచారం తెలుసుకోండి: