ఏపీలో తెలుగుదేశం పార్టీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని అంటున్నారు. ఓ వైపు అధికారం ద‌క్క‌ద‌నే ఆందోళ‌న‌కు తోడుగా, మ‌రోవైపు రాష్ట్రంలో త‌మ‌ను ప్ర‌జ‌లు దూరం కొట్టారనే ఆగ్ర‌హం జ‌త‌కూడ‌టంతో ..తెలుగుదేశం పార్టీ నేత‌లు చిత్ర‌విచిత్ర‌మైన ప్ర‌చారాల‌కు విమ‌వ‌ర్శ‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. తాజాగా మ‌రోమారు అదే త‌ర‌హా ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టగా ఊహించ‌ని షాక్ ఎదురైంది. 


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డితో హైదరాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రానికి చెందిన మొత్తం 48 ఐఏఎస్‌ అధికారులు రహస్యంగా భేటీ అయ్యారని తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌చారంలో పెట్టారు. కొన్ని మీడియా సంస్థ‌లు సైతం ఇదే అంశాన్ని పేర్కొన్నాయి. అయితే, ఈ విషయాన్ని రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం తోసిపుచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం కొంతమంది ఐఏఎస్‌ అధికారులు ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, దీనిని సాకుగా చేసుకొని అధికారులు వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ అయ్యారని అసత్యప్రచారాన్ని చేపట్టడాన్ని సంఘం ప్రతినిధి కొట్టిపారేశారు. ఇప్పటి వరకూ ఏ ఒక్క ఐఏఎస్‌ అధికారి కూడా అనధికారికంగా జగన్మోహన్‌రెడ్డితో భేటీ కాలేదని, ఇటువంటి అసత్య ప్రచారాలతో ఐఏఎస్‌లలో ఐక్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన అన్నారు. ఇదే అంశంపై రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం విచారణ నిర్వహింస్తోందని, తమకు అందిన ప్రాథమిక సమాచారాన్నిబట్టి రాష్ట్ర ఐఏఎస్‌ అధికారులెవ్వరూ జగన్‌తో సమావేశం కాలేదని వివరణ ఇచ్చారు. కొత్తప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఎవరు పరిపాలనా పగ్గాలు చేపడితే వారి వద్ద పనిచేయాల్సి ఉంటుంది కదా? అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.


కాగా, ఏపీలో త‌మ‌కు ఆద‌ర‌ణ త‌గ్గిపోయిన విష‌యాన్ని గ‌మ‌నించిన తెలుగుదేశం పార్టీ నేత‌లు ఇలా ప్రచారం నిర్వ‌హిస్తూ ఉన్న‌త‌దాధిక‌రుల‌పై త‌ప్పుడు ప్ర‌చారానికి పాల్ప‌డుతున్నార‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. రాజ‌కీయాల్లోకి ఉన్న‌తాధికారుల‌ను లాగ‌డ ఎందుక‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: