ఎన్నికల సమయంలో మీడియా కూడా శ్రుతి మించుతుంటుంది. అందులోనూ పార్టీలకు అనుబంధంగా ఉన్న పత్రికలైతే వాటి అరాచకాలకు అంతూ పొంతూ ఉండదు. ప్రతి విషయంలోనూ తమ యాజమాన్య పార్టీకి అనుకూలంగా.. దాని ప్రత్యర్థికి ప్రతికూలంగా ఏ పాయింట్ దొరుకుతుందా అని వెదికి వెదికి మరీ రాస్తారు. 


మన తెలుగులోనూ ఇలాంటి కల్చర్ ఉంది. ప్రముఖ దిన పత్రికలన్నీ పార్టీల అనుబంధ కరపత్రాల్లాగానే మారిపోయాయి. అయితే తమిళ పత్రికలు మరో అడుగు ముందుకేశాయి. ఏకంగా జర్నలిజం విలువలను పాతాళానికి దిగజారుస్తూ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతున్నాయి. 

ఇటీవల కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కమల్ హాసన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. నమదు అమ్మ అనే పత్రిక ఓ పేజీకి సరిపడా వ్యతిరేక కథనం వండివార్చింది. ఇలాంటి ఎన్నికల సమయంలో ఇలాంటివి మామూలే కానీ..

ఈ పత్రిక మరీ హద్దు దాటింది.. కమల్ హాసన్ తన కూతురు శ్రుతిహాసన్‌ ను ముద్దుపెట్టుకునే ఫోటోను ప్రముఖంగా ప్రచురించి..బలిసిన ఎద్దుకు ఏం తెలుసు హిందూ విశిష్టత అంటూ టైటిల్ పెట్టింది. అంటే కమల్ హాసన్‌కు వావీ పరుసలు ఉండవు అని పరోక్షంగా చెప్పేందుకు అక్కడ ఆ ఫోటో వాడింది. ఇలా దిగజారి మరీ రాసిన ఈ కథనంపై తమిళ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: