చంద్రబాబునాయుడుకు తొందరలో ఢిల్లీలో కీలక పదవి రాబోతోందని ఈయన సామాజికవర్గంలో బలమైన ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి రేపటి ఫలితాల్లో టిడిపి మళ్ళీ గెలవటం కష్టమని అందరికీ అర్ధమైపోతోంది. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలో బలమైన కమ్మ సామాజికవర్గంలో చంద్రబాబు తొందరలో ఉప ప్రధానమంత్రి అయిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 

చంద్రబాబు ఉపప్రధాని అవటానికి ఉన్న అవకాశాలేంటి అనే విషయాలను మాత్రం ఎవరూ చెప్పటం లేదు. వాళ్ళ ప్రచారమంతా ఢిల్లీలో చంద్రబాబుకు కీలక పదవి వస్తుందన్నదే. అంటే చంద్రబాబును సామాజికవర్గంలోని నేతలు ఏ పదవీ లేకుండా చూడలేకపోతున్నట్లు అర్ధమైపోతోంది. అసలు రేపటి కౌంటింగ్ లో టిడిపి ఓడిపోయేందుకు అవకాశాలున్నాయన్న ప్రచారాన్నే తట్టుకోలేకపోతున్నారు. అందులో నుండి మొదలైందే చంద్రబాబుకు ఉపప్రధానమంత్రి పదవి అనే ప్రచారం.

 

ఏదో సామాజికవర్గం కాబట్టి అనుకుంటున్నారు కానీ చంద్రబాబుకు కేంద్రస్ధాయిలో పదవి రావటానికి అవకాశాలు ఎంతున్నాయి ? చంద్రబాబు ప్రస్తుతానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి మద్దరుదారుగా ఉన్నా యూపిఏలో అయితే లేరు. అదే సమయంలో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినా బిజెపిపై మోజు ఇంకా తీరలేదని తాజాగా అర్ధమైపోయింది. బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్ధితుంటే మోడిని తప్పిస్తారని, గడ్కరీ అయితే టిడిపికి బాగుంటుందని చంద్రబాబు చెప్పటంలో అర్ధమేంటి ?

 

మోడి కాకుండా ఎన్డీఏలో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఏ గడ్కరీయో అయితే చంద్రబాబు వెంటనే ఎన్డీఏలోకి దూకేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాకాకుండా యూపిఏ అధికారంలోకి వస్తే రాహూల్ ప్రధాని అయితే అప్పుడు చంద్రబాబుకేమన్నా పదవి వస్తుందేమో తెలీదు. అదికూడా జగన్మోహన్ రెడ్డిపై ఆధారపడకుండా యూపిఏ అధికారంలోకి రాగలిగితేనే చంద్రబాబుకు అవకాశం.

 

అంటే ప్రస్తుత పరిస్ధితుల ఆధారంగా అయితే యూపిఏ, ఎన్డీఏలో ఏ ఒక్కదానికి కూడా ఇతరుల మద్దతు లేకుండా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని అర్ధమైపోతోంది. అందుకనే కెసియార్, జగన్ లాంటి వాళ్ళకోసం రెండు కూటములు గాలమేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కెసియార్ లాంటి వాళ్ళు కేంద్రంలో పదవులు ఆశిస్తారు కానీ చంద్రబాబుకు పదవంటే ఎందుకు ఒప్పుకుంటారు ? చూద్దాం 23వ తేదీ తేలిపోతాయి కదా జాతకాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: