రాజకీయమైనా ఏ రంగమైనా గెలవడానికి ఏ కారణాలూ అవసరం లేదు. ఓడడానికి మాత్రం సవా లక్ష కారణాలు ఉంటాయి. అయితే టీడీపీ మాత్రం విచిత్రమైన లాజిక్కులు చెబుతూ గెలిచేస్తామని అంటోంది. అయిదేళ్ళ పాలనలో ఏమీ చేయలేదనో, చేసినా జనానికి అందులో పనికొచ్చి ఓట్లు రాల్చేవి లేవనో కానీ టీడీపీ చివరాఖరున పంచేసిన పసుపు కుంకుమ కానుకలను గట్టిగా నమ్ముకుంది.


మరి వాటి పవరేంటన్నది ఎన్నికల్లో తేలుతుంది. అంతకంటే ముందు ఈ ఆదివారం ఎగ్టిట్ పోల్స్ లో కూడా నిఖరంగా తెలిసిపోతుంది. నిజానికి ఎగ్టిట్ పోల్ లో చాలా వరకూ నిజాలే చెబుతారు. వోటెసి వచ్చిన ఆ హుషార్ లో చెప్పాల్సింది  ఓటరు చెప్పేస్తారు. అందులోనూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ నిలబడి మరీ క్యూలు కట్టి ఓటేసిన మహిళలు పెద్ద సంచనలం రేపారు. దాంతో ఆ ఓటింగ్ కధ ఏంటన్నది తెలుసుకోవాలని సర్వేశ్వరులకు బాగా ఉంటుంది.


ఇదిపుడు ఎగ్టిట్ పోల్ లో కచ్చితంగా బయటపడుతుందని అంటున్నారు. నిజానికి టీడీపీని ఓడించాలనుకునేందుకు లక్ష  కారణాలు ఉన్నాయి. గెలుపు కోసం మాత్రం ఒకే ఒక్క కారణం పసుపు కుంకుమ. అరచేతితో సునామీని అడ్డుపెట్టినట్లుగా టీడీపీని విజయ తీరాలకు చేర్చేందుకు పసుపు కుంకుమ ఎంత బాగా పనిచేసిందన్నది తేలిపోతుంది. మరి ఎగ్టిట్ పోల్ చూసిన తరువాత అయినా తమ్ముళ్ళకు అసలు సంగతి బాగా అర్ధమైపోతుందని అంటున్నారు. అందుకే ఎగ్టిట్ పోల్స్ చూడొద్దు, నమ్మొద్దు అంటూ బాబు గారు ముందే చెప్పేశారు. అయినా తమ్ముళ్ళకు ఎన్నో డౌట్ల్స్, మరెన్నో భయాలు. వాటిని పెంచేలా ఎగ్టిట్ పోల్స్ వుంటాయని స్వయంగా బాబుగారే చెప్పాక పసుపు కుంకుమ స్టొరీలకు విలువు ఉంటుందా.


మరింత సమాచారం తెలుసుకోండి: