వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో బిజీ బిజీగా పర్యటిస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయన గురువారం కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌ పీర్ దర్గాను జగన్ దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ముందుగా పీరుల్లా మాలిక్‌ మజార్‌ను సందర్శించి అక్కడ పూలచాదర్‌ సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. తరువాత పీరుల్లా మాలిక్‌ కుటుంబ సభ్యుల మజార్‌ను సందర్శించి పూలచాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  దర్గా సాంప్రదాయాన్ని పాటిస్తూ జగన్‌కు తలపాగా చుట్టి సత్కరించారు. 


దివంగత ముజావర్‌కు వైసీపీ చీఫ్ నివాళలుర్పించారు. ఆయన వెంట కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, నేతలు, కార్తకర్తలు ఉన్నారు. దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని, కొద్దిసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత పెద్దదర్గా ఆవరణలో అంజద్‌బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..అల్లా కృప వల్ల ప్రజలందరూ చల్లగా ఉండాలని..ఆయన దీవెనలు అందరిపై చూపించాలని అన్నారు.  అదే విధంగా రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: