తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఆ పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సెటైర్లు వేశారు. పార్టీలో నెల‌కొన్న ప‌రిణామాల‌పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు  చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.`` అంటూ ఓ ట్వీట్లో వ్యాఖ్యానించారు. 


ఉప ఎన్నిక‌ల విష‌యంలో విజ‌య‌సాయిరెడ్డి  స్ప‌ష్ట‌త ఇచ్చారు. ``చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూతుల్లో దళితులను బెదిరించి టీడీపీ రిగ్గింగుకు పాల్పడిన ఆరోపణలు రుజువు  కావడంతో ఈసీ రీపోలింగుకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడకపోతే వాళ్లకెందుకు భయం. రీపోలింగు అన్యాయం అంటూ ఆందోళనకు దిగడమేమిటి సిగ్గులేకుండా? దళితులు ఈసారి సత్తా చూపాలి.`` అంటూ వ్యాఖ్యానించారు.


కాగా, జాతీయ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ``పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఒక మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా? ఎలక్షన్‌ కమిషన్‌ మెతగ్గా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో ఇదే తరహా రిగ్గింగుకు పాల్పడేవాడు కాదా?`` అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: