ఏపీలో అధికారం మార్పిడి చాలా అంశాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. కేవలం అయిదేళ్ల క్రితం విడిపోయిన నవ్యాంధ్రకు రాజధాని ఇప్పటికీ లేదు. చంద్రబాబు తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినా ఆయన విలువైన కాలాన్ని డిజైన్లు గ్రాఫిక్స్ అంటూ గడిపేశారు.. ఈ పరిస్థితుల్లో అమరావతి పేరిట రాజధాని అన్నది చెప్పుకునేందుకు పేపరల్లో కాగితాల మీద కనిపిస్తుంది కానీ అక్కడ మాత్రం ఏమీ లేదు.


మరి అమరావతి రాజధాని ప్రాంతం ఎంపికనే తొలి నుంచి వైసీపీ వ్యతిరేకిస్తోంది. అయినా చంద్రబాబు తన మనుషులతో వేసిన కమిటీ ద్వారా అమరావతిని ఎంపిక చేశారు. దానికి అసెంబ్లీలో జగన్ సైతం ఒకే చెప్పాల్సివచ్చింది. కోస్తా ప్రజల మనోభావాలను ద్రుష్టిలో ఉంచుకునే జగన్ ఆలా చేయాల్సివచ్చింది. ఇక రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు సేకరించడం పట్ల కూడా జగన్ తన అసమ్మతిని తెలియచేస్తూ వచ్చారు. ఇక రాజధాని రైతులకు తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కూడా జగన్ చెప్పారు.


రెపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే అమరావతి ప్లాన్ మొత్తం మార్చేస్తారని అంటున్నారు. అవసరమైన మేరకే రైతుల నుంచి భూములు తీసుకుని మిగిలిన వాటిని వారికి ఇస్తారని కూడా అంటున్నారు. అదే విధంగా జగన్ కేవలం కోస్తా ప్రాంతం మాత్రమే కాకుండా ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ కూడా సమగ్రమైన అభివ్రుధ్ధిని సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తారని కూడా అంటున్నారు. వీలైనంత మేరకు అమరావతి మీద భారం తగ్గించి పాలన కూడా వికేంద్రీకరించేలా జగన్ ఆలోచనలు ఉంటాయని అంటున్నారు. మరి చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: