కేంద్రంలో తరువాత ప్రభుత్వం తమదేనని ఓ వైపు కాంగ్రెస్ మరో వైపు ప్రాంతీయ పార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, మాయావతి చెప్పుకుంటున్నాయి. కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి యూపీయే, ఎండీయేలో లేని న్యూట్రల్ పార్టీలను దువ్వుతోంది. ఆ విధంగా వాటి మద్దతు పొంది రేపటి రోజున డిల్లీ పీఠం పట్టాలని చూస్తోంది. మరి కాంగ్రెస్ కోరిక తీరుతుందా.


అంటే కాదనే అంటున్నారు ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రతినిధులు. మోడీకి మరో సారి ప్రధాని అయ్యేందుకు అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని, ఆయనకు మూడు పార్టీలు ప్రధానంగా మద్దతు ఇస్తాయని కూడా చెబుతున్నారు. టీయారెస్, వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ వెంట నడవవు అంటున్నారు. ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిసెర్చ్ అనలిస్ట్ శ్రీయాస్ భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కంటే బీజేపీయే ఈ మూడు పార్టీలకు అనుకూలమని అన్నారు.  అందువల్ల ఆయా పార్టీలు తప్పకుండా మోడీని మరోసారి ప్రధానిని చేస్తాయని చెప్పుకొచ్చారు.


ఇక స్థానిక రాజకీయ పరిస్థితులు చూసినా అలాగే అనిపిస్తున్నాయి. సోనియాగాంధీ కుటుంబం అంటే జగన్ ఇప్పటికీ ద్వేషిస్తారు. తనను తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ ముఖం కూడా జగన్ చూడదలచుకోవడంలేదు. ఇక తెలంగాణాలో టీయారెస్ కి కాంగ్రెస్ తోనే పెద్ద ముప్పు ఉంది. రాజకీయంగా అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. అందువల్ల ఆయన కేంద్రంలో అధికారంలోకి ఆ పార్టీని తెచ్చి ఇబ్బందులు పెట్టుకోరు. అలాగే ఒడిషాలో నవీన్ పట్నాయక్ కూడా కాంగ్రెస్ కు నో చెబుతున్నారు. ఫఒనీ తుపాన్ రివ్యూకి వెళ్ళిన ప్రధాని మోడీ తనకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పట్నాయక్ ని ఒప్పించారని అంటున్నారు. మొత్తానికి చూస్తే అతి పెద్ద పార్టీగా బీజేపీ గెలిస్తే చాలు మోడీయే మళ్ళీ ఈ దేశానికి ప్రధాని అంటున్నారు ఆర్ధిక నిపుణులు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: