రవి ప్రకాష్ కెరీర్ కు జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగింది. ఇప్పుడూ రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు. అతడ్ని ఏ క్షణానైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏరికోరి రవిప్రకాష్ ను ఏ ఛానెల్ తీసుకోదు. అది ఆ ఛానెల్ కే మచ్చ తెచ్చిపెడుతుంది. సో... రవిప్రకాష్ కెరీర్ కు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదు.


పోలీసులకు కనిపించకుండా దాక్కోవడంపైనే ప్రస్తుతం రవిప్రకాష్ దృష్టంతా ఉంది. ఏ ఛానెల్ కు వెళ్లాలనే అంశంపై ఆలోచించే స్థితిలో ఆయనలేరు. సో.. అతనిపై వస్తున్న పుకార్లలో వాస్తవంలేదు. ప్రస్తుతానికైతే రవిప్రకాష్ పై జారీచేసిన నోటీసు గడువు కూడా ముగిసింది. పోలీసులకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న నేరంపై ఈరోజు అతడిపై మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది.


వీటికితోడు రవిప్రకాష్ పై తాజాగా మరో కేసు కూడా ఫైల్ అయింది. ఇప్పటికే ఫోర్జరీకి సంబంధించి రవిప్రకాష్ పై 420 సెక్షన్ కింద కేసు నమోదు కాగా, ఇప్పుడు అదే 420 సెక్షన్ కింద మరో కేసు నమోదైంది. టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ ను కేవలం 90వేల రూపాయలకు మరో కంపెనీకి అమ్మేసినట్టు సంస్థ డైరక్టర్లు గుర్తించారు. ఇక్కడ కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, డీడీల్ని ముందుగానే అసైన్ చేశారంటూ సంస్థకు చెందిన కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదుచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: