ఎన్నికల పలితాలు దగ్గర పడుతున్నా కొద్దీ శ్రీచంద్ర ప్రవచనాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. నీతులు సూక్తిముక్తావళి వల్లించటం టిడిపికి జీవన విధానం అయి పోయింది. తనకున్న ఆర్ధిక రాజకీయ కుల బలంతో పెట్రెగిపోయి రిగ్గింగ్ చేసిన తీరు సిసిటివి ఫూటెజులలో కనిపిస్తున్నా శ్రిచంద్ర గురివింద నీతుల ప్రవాహం తప్పట్లేదు 

సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో ద్వివేది మాట్లాడారు. ‘‘పోలింగ్‌ రోజునాటి సీసీ ఫుటేజీలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అని కూడా అనిపించింది. ప్రైవేటు వ్యక్తులు సైతం పోలింగ్‌ బూత్‌ల్లోకి ప్రవేశించారు. రిగ్గింగ్‌ జరిగినట్లు తేలింది. దీనిపై సమగ్ర నివేదిక పంపిన అనంతరం భారత ఎన్నికల కమిషన్‌ రీపోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఘటన గురించి ఆలస్యంగా తెలిసిందని అందుకే రిపొలింగ్ కు ఆదేశించడం ఆలస్యం అయిందని తెలిపారు.

Image result for YS jagan about repolling

అయితే ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని, కొందరికి సహకరించటం, మరి కొంతమందికి అన్యాయం జరిగేలా ఏకపక్షంగా వ్యవహరించటం తగదని తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్లు సుశీల్‌ చంద్ర, అశోక్‌ లావాసాలను కలిశారు. 

చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగుపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రీ-పోలింగ్ తెలుగుదేశం చేస్తున్న రాద్ధాంతా న్ని ఖండించారు 

.@ncbnగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా?రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అయిదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఈసీని కోరుతున్నా.

Image result for YS jagan about repolling

చంద్రబాబు! రీపోలింగ్‌ అప్రజాస్వామికమా? లేక రిగ్గింగా? అంటూ నిలదీశారు. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరువేయటం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? అంటూ ప్రశ్నించారు. అసలు రీ-పోలింగ్ అంటే మీకెందుకు అంత భయం? అని నిలదీశారు. 

రిగ్గింగ్ జరిగిన ఆ ఐదు పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్‌ ప్రజాస్వామికంగా జరిపించాలని ఎన్నికల సంఘాన్ని జగన్మోహనరెడ్డి కోరారు. ఇకపోతే చంద్రగిరి నియోజకవర్గం లోని ఐదు పోలింగ్ బూతులలో ఈనెల 19 న అంటే రేపు ఆదివారం రీ-పోలింగ్ జరగనుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూతులలో రీపోలింగ్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఎన్నికలు జరిగిన దాదాపు 40 రోజులకు రీ-పోలింగ్ నిర్వహించడం పై న్యాయ స్థానాలను సైతం ఆశ్రయించింది.  అయితే వైసిపి మాత్రం రీ-పోలింగును స్వాగతిస్తోంది. ఇప్పటికే ఈ రీ-పోలింగ్ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. ఆదివారం జరగబోయే లోపు ఇంకెన్ని పరిణమాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: