"ఎవ్వరికీ భయపడను బెదిరేది లేదు" - "నిప్పులా బ్రతికా, ఏప్పుడూ తప్పు చేయలేదు" ఈ డయలాగ్ వింటూనే అది ఎవరిదో చెప్పగలరు ఉభయ రాష్ట్రాల తెలుగు వాళ్లు.  చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తంలో ఈ స్థాయిలో టెన్షన్ పడింది ఎప్పుడూ లేదని చంద్రబాబును దగ్గరగా చూస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇటు రాజకీయంగా అటు వ్యక్తిగతంగా మరోప్రక్క తనపై నమోదైన కేసుల విచారణలపై స్టేలు ఎత్తివేస్తున్న కారణంగా.
Image result for lakshmi parvati chandrababu pai akramastulakeasu
గత కాలంలో తరచుగా చేసిన ఢిల్లీ టూర్ల నేపథ్యంలో కూడా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు ఏమీలేవు. "కేవలం రాష్ట్ర ప్రయోజనాలే" అని తాను పలుమార్లు చెప్పడం తో పాటు టిడిపి నాయకులచేత కూడా చెప్పిస్తూ ప్రచారం చేయించుకుంటూ ఉంటారు చంద్రబాబు. 

అయితే టిడిపిలో న్యాయ వ్యవహారాలను చూసుకునే ఒక నాయకుడి ద్వారా నేషనల్ మీడియా గతంలో కొన్ని నిజాలు రాబట్టింది. తెలుగు మీడియాకు పట్టకుండా పోయిన ఒక వార్త నేషనల్ మీడియాలో మాత్రం బాగా హైలైట్ అయింది. సంవత్సరాల పాటు-స్టే-లు ఉండరాదని, మినిమం టైం పీరియడ్ తర్వాత ఎవ్వరిపైన అయినా సరే స్టేలు ఎత్తివేయాలని గత సంవత్సరం సుప్రీంకోర్టు దేశంలోని అన్నీ న్యాయస్థానాలకు ఆదేశాలిచ్చింది. ఇలాంటి చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే వార్తలు తెలుగు ప్రధాన మీడియా అసలు చర్చల్లోకి రానివ్వదు. 

దేశంలో ఉన్న ప్రజా ప్రతినిధులందరి కంటే ఎక్కువ సంఖ్యలో తనపై నమోదైన విచారణలపై స్టే లు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు మాత్రమే అని న్యాయ నిపుణు లు చెప్తూ ఉంటారు. న్యాయ వ్యవస్థను చంద్రబాబు మేనేజ్ చేసే విధానం గురించి సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ మేధావులు కథలుకథలుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ స్టే ల ఎత్తివేత సంకట స్థితి నేపథ్యంలోనే చంద్రబాబు ప్రత్యేకంగా గత సంవత్సరం అనేక ఢిల్లీ టూర్లు పెట్టుకున్నాడని వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారు. "చంద్రబాబుతో అవాంచనీయ సాన్నిహిత్యం" అంటూ ఒక సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ పై నాటి మరో సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ (నేడు ఆయన రిటైరయ్యారు) వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరూ తెలుగువారే అమరావతి ప్రాంతానికే చెందిన కమ్మవారే. దీన్నిబట్టి న్యాయవ్యవస్థను చంద్రబాబు మానేజ్ చేశారంటే ఎవరికైనా సందేహమే రాదు.( https://barandbench.com/collegium-scanner-chelameswar-j-suggest-nexus-executive-judiciary/ )


టిడిపి న్యాయవ్యవహారాలు చూసే నేత గత కొద్ది మాసాలుగా ఢిల్లీలోనే మకాంవేసి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. చిన్నస్థాయి నుంచే చంద్రబాబును నమ్ముకుని, చంద్ర బాబు కోసం పనిచేసిన కొందరు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నత కీలక స్థానాల్లో ఉన్నారు. అందుకే వాళ్ళను ఒక సారి కలిసి పాత స్టే ల విషయంలో సమస్యలు రాకుండా చూసు కోవడంపై బాబు దృష్టిపెడుతున్నాడట. అయినా లక్ష్మీ పార్వతి చంద్రబాబు పై వేసిన అక్రమ ఆస్తులకేసు రానున్న జూన్లో విచారణకు రానుంది. 


అయితే ఈ మద్య కొత్తగా ఏవైనా కేసులు నమోదయితే అంతా ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర అని చెప్పొచ్చు. కానీ పాత కేసుల్లో స్టే లు ఎత్తివేసి విచారణ చేపడితే ఆ అవకాశం అంత తీవ్రంగా ఉండదని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పాతకేసులు మాత్రం మెడకు చుట్టుకోకుండా బాబు వ్యూహాలు రచిస్తున్నారని ఢిల్లీ వేదికగా పనిచేస్తున్న జర్నలిస్టులు, విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
Image result for managing judiciary system in his favor by chandrababu
అయితే ఎన్నికల పలితాల తరవాత ఇక చంద్రబాబుపై ఉన్న కేసుల విచారణ స్టేల ఎత్తివేత జరిగి ఒకదాని తరవాత మరో కేసు న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయ ని డిల్లీ స్థాయిలో విశ్లేషకుల అభిప్రాయం. మున్ముందు ఇదే విషయంపై ఇంకా ఎన్ని కథనాలు వస్తాయో! చూడాలి మరి. అయినా నరేంద్ర మోడీ హయాంలో కూడా న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసే స్థాయి చంద్రబాబుకు ఉందా? అని మాత్రం టిడిపి నాయకులు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇక ఓటుకు నోటు కేసు కాలనాగై కాటు వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పుడు బాబు కోసం జూన్ లో అక్రమాస్తుల కేసు ఎదురు చూస్తుంది. బాబు ఇక బిజీ! బిజీ!  

మరింత సమాచారం తెలుసుకోండి: