ఎన్నికల పోలింగ్ ముగిసిన మరునాటి నుంచే ఎన్నికల కమిషన్ పై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు తాజాగా చంద్రగిరి రిపోలింగ్ అంశంపైనా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రీ పోలింగ్ నిర్ణయం తెలియగానే నేరుగా ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఇదెక్కడి చోద్యమని ఈసీని నిలదీశారు. 


చంద్రబాబు ఎంత ఆవేశంగా వచ్చినా అక్కడ ఈసీ అధికారులు మాత్రం కూల్ గా సమాధానం చెప్పారట. ఎక్కువ మాట్లాడకుండానే ఆయనకు ఓ వీడియో చూపించారట. ఇదిగో మీ పార్టీ వాళ్లు ఇంత దారుణంగా ప్రవర్తించారు చూసుకోండి..అంటూ వీడియో ఫుటేజ్ బయటపెట్టారట. 

ఆ వీడియోల్లో బుత్ క్యాప్చరింగ్ చేసి ఓట్లు రిగ్గింగ్ చేయడం క్లియర్‌ గా రికార్డయ్యిందట. మరీ ఇంత ఘోరంగా ఉన్నా కూడా రీ పోలింగ్ పెట్టకూడదా అని ఈసీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించారట. డైరెక్టుగా వీడియోలే చూపించాక ఇక మట్లాడటానికి ఏముంటుంది. 

అందుకే చంద్రబాబు సైలెంట్‌ గా బయటకు వచ్చేశారట. ఇక ఆ తర్వాత ఈసీ బయట ఆయన రొటీన్ ప్రెస్ మీట్ సంగతి తెలిసిందే కదా. ఎన్నికల సంఘం వివక్ష మీద నిప్పులు చెరిగేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు చంద్రబాబు. అదీ సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: