ఓ వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ గెలుస్తామా లేదా అని తల్లడిల్లుతున్నారు. పోలింగ్ సరళి తీరు తెలియక తికమకపడుతున్నారు. పోలింగ్ ముగిసి ఇప్పటికి నెల దాటినా చంద్రబాబులో కంగారు మాత్రం పెరిగిపోతోంది  తప్ప తగ్గడంలేదు అదే సమయంలో వైఎస్ జగన్ మాత్రం కూల్ గా ఉన్నారు. ఆయన లోటస్ పాండ్ లో ఉన్నా, విదేశీ విహారం చేసినా, కడపలో ప్రజాదర్బార్ పెట్టినా ఆ ముఖంలో అదే ధీమా కనిపిస్తోంది.


కారణమేంటి  అంటే తలపండిన రాజకీయ పండితులకు కూడా అంతుపట్టడంలేదు. ఈసారి ఎన్నికలు అనూహ్యంగా జరిగాయని త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషణలు ఓ వైపు సాగుతున్నాయి. జనసేన చీల్చే ఓట్లు ఎవరికి దెబ్బ అంటూ కూడా వాదనలు జరుగుతున్నాయి. ఎవరు గెలిచినా మెజారిటీలు తక్కువేనని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ రాదు అని కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ తన చెవిన పడుతున్నా జగన్ మాత్రం అంత కూల్ గా ఎలా  ఉంటున్నారో సొంత పార్టీ వారికే అర్ధం కావడమేదట.


అయితే ఇక్కడో విషయాన్ని చెప్పుకోవాలి. అప్పట్లో అన్న గారు కూడా ఇలాగే ఫలితం విషయంలో ధీమాగా ఉండేవారంటారు. తొలిసారి పార్టీ పెట్టినపుడు రిజల్స్ట్స్ విషయంలో ఆయన టెన్షన్ పడలేదంటారు. ఆలాగే 1994లో రికార్డ్ స్థాయిలో సీట్లు వస్తాయని ముందే చెప్పిన అసలైన సర్వేశ్వరుడాయన. ఇక ఎన్నికల  ఫలితాల విషయంలో ఎపుడు బెదురు, బెంగ లేని రాజకీయ ధీరుడు అన్న గారు.
అదే విధంగా వైఎస్సార్ కూడా  విజయం విషయంలో  ఎపుడూ కంగారు, కలవరం పడలేదు, 1999 ఎన్నికల్లో దగ్గర దాకా వచ్చి అధికారం చేజారిపోతే నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకున్నారు వైఎస్సార్. అలాగే 2004లో రికార్డులు బద్దలు కొట్టారు. 2009లో అయితే మనమే గెలుస్తున్నామంటూ తల పండిన సీనియర్లకు సైతం చెప్పే స్థాయికి ఎదిగారు వైఎస్సార్. .


ఇపుడు జగన్ కూడా అచ్చం అన్న గారు, వైఎస్సార్ బాటలో నడుస్తున్నారు. ఆయన కూడా జనాన్నే నమ్ముకున్నారు. తాను తట్టిన ప్రతి గుండె చప్పుడు ఒక్క జగన్ కే వినిపిస్తుంది. దాని ముందు ఏ సర్వేలు సరి సాటి కావు. జనం ఏమనుకున్నారో ప్రజల మనిషిగా జగన్ ముందే తెలుసుకున్నారు. అందుకే ఆయన ఎన్ని రకాల విన్యాసాలు ఎవరు చేసినా పట్టించుకోవడంలేదు. జనాన్ని నమ్మినవారెవరూ ఇప్పటి వరకూ ఓడిపోలేదు.  అదే జగన్ విషయంలో ఈ నెల 23న మరో మారు రుజువు కాబోతుందని అంటున్నారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: