చీఫ్ ఎలక్షన్ కమీషన్ ముందు చంద్రబాబునాయుడు తలదించుకున్నారు. నిజంగా ఇది చంద్రబాబుకు అవమానమే. రీ పోలింగ్ అంశంలో ఎలక్షన్ కమీషన్ పై చంద్రబాబునాయుడు నోరు పారేసుకున్నారు. ఎలక్షన్ కమీషన్ ను ఎన్నో మాటలన్నారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ఢిల్లీకే వెళ్ళారు. తీరా సీఈసీని కలిసిన తర్వాత నోరు లేవలేదట. నిజంగా ఎంతటి అవమానం జరిగుతుందని బహుశా అనుకోలేదేమో ?

 

రీ పోలింగ్ విషయంలో తనను కలసి ఫిర్యాదు చేయటానికి వచ్చిన చంద్రబాబుకు రిగ్గింగ్ తాలూకు వీడియో ఫుటేజిని సీఈసీ చూపించిందట. ఐదు పోలింగ్ కేంద్రాల్లో టిడిపి నేతలు ఓటర్లను పక్కన పెట్టేపి యధేచ్చగా రిగ్గింగ్ చేసుకుంటున్న దృశ్యాలను చంద్రబాబుకే చూపిందట. టిడిపి నేతలు చేస్తున్న  రిగ్గింగ్ దృశ్యాలను స్పష్టంగా చూసిన తర్వాత చంద్రబాబుకు నోట మాట రాలేదట.

 

వైసిపి చెప్పినట్లు వింటు ఎలక్షన్ కమీషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని అమరావతిలో గొంతు చించుకున్న చంద్రబాబుకు తమ నేతల చేతివాటం చూసిన తర్వాత నోరు లేవలేదని సమాచారం. దాంతో అవమాన భారంతో తలదించుకున్నారు. అయితే అక్కడి నుండి వచ్చేస్తే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు ?  పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఫిర్యాదులు చేయాలికానీ ఇన్ని రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే యాక్షన్ ఎలా తీసుకుంటారు ? అంటూ మళ్ళీ లా పాయింట్ లేవనెత్తారట.

 

దానికి కూడా సీఈసీ సమాధానం చెప్పటంతో ఏమీ మాట్లాడలేక, ఎలక్షన్ కమీషన్ ను తప్పు పట్టలేక అక్కడి నుండి అవమాన భారంతో బయటకు వచ్చేశారు. అయితే బయటకు రాగానే మళ్ళీ ఎలక్షన్ కమీషన్ పై ఫిర్యాదులు మామూలే అనుకోండి అది వేరే సంగతి. ఎందుకంటే అక్కడున్నది చంద్రబాబు కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: