ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మహాత్మాగాంధీ హంతకు డు నాథురామ్ గాడ్సే నిజమైన దేశ భక్తుడని ప్రశంసించి ప్రజ్ఞాసింగ్ గాంధీజీని అవమానించారని, ఆమెను ఎన్నటికీ క్షమించబోనన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మీ డ్రామాలిక ఆపండి. జాతీయ ప్రముఖులు, వ్యవస్థలను కించపరిచే చర్యలను మీరే ప్రారంభించారు. సాధ్వి దాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు. మీ ఆఫీసులో గాడ్సే తదితర కుట్రదారుల ఫొటోలు లేవా? అని ట్వి ట్టర్‌లో ప్రశ్నించారు. 


మోదీ మీడియా సమావేశంపైనా ఎంఐఎం అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. @ పీఎంవో (ప్రధాని కార్యాలయం).. నైస్ ప్రెస్ కాన్ఫరెన్స్. మీరు ఊరకే కూర్చోవడానికి బదులు, ప్రశ్నలు స్వీకరించి ఉంటే బాగుండేది. మీరు అక్కడున్నది కేవలం దర్శనానికే తప్ప ప్రశ్నలకు జవాబివ్వడానికి కాదు. కచ్చితంగా ప్రతిఒక్కరూ ఎక్కడో ఓ చోట ప్రశ్నించడం మొదలుపెడతారు అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: